Pawan special interest on varun tej movie

Varun Tej finally confirmed, Seethamma Vaakitlo Sirimalle Chettu fame Srikanth Addala, Srikanth Addala,,

Pawan special interest on Varun Tej movie, Chiranjeevi and Pawan Kalyan are taking so much of care such that the movie comes out really well

కొరియోగ్రఫీ చేస్తున్న పవన్

Posted: 11/15/2013 06:28 PM IST
Pawan special interest on varun tej movie

ఇప్పటి వరకు స్ర్కిప్టు వర్క్, దర్శకత్వం, ఫైట్స్ లలో వేలు పెట్టిన పవన్ కళ్యాణ్ త్వరలో కొరియోగ్రఫీ కూడా చేయబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అదేంటి పవన్ కళ్యాణ్ కే డాన్స్ అంతంత మాత్రం వస్తుంది ఈయన కొరియోగ్రఫీ చేయడం ఏంటని అనుకుంటున్నారా?  పవన్ ఏదైనా తనది అనుకుంటే ఎంత రిస్క్ అయినా చేస్తాడు.

ఇప్పుడు తన అన్న కొడుకు అయిన వరుణ్ తేజ్ తెరంగ్రేటం చేయడానికి రెడీ అయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వడోతున్న ఈ సినిమా నూతన సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి ప్రారంభంకాబోతోంది. దీనికి సంబంధించిన  ప్రతి విషయంలో  పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. స్క్రిప్ట్ ఓకే అయిన ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ పాటలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచబోతున్నాడట. అంతే కాదు ఆయనే దగ్గరుండి ఒక పాటకు కొరియో గ్రఫీ డిజైన్‌ చేయబోతున్నారని సమాచారం.

అలాగే మ్యూజిక్ సిట్టింగ్‌లలో కూర్చుని పాటల ట్యూన్స్‌ను వినడమే కాకుండా సంగీత దర్శకుడుకి పలు సూచనలు ఇస్తున్నాడని అంటున్నారు. మరి అన్ని దగ్గరుండి చూసుకుంటున్న పవన్ ని చూస్తే అన్న కొడుకు కోసం పడే తాపత్రం ఏకైక హీరో పవనే అని అంటున్నారు ఫ్యాన్స్. ఇంత వరకు బాగానే ఉన్నా గతంలో ఇతను వేలు పెట్టిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన సంగతి గుర్తుచేసుకుంటున్నవారు లేకపోలేదు. మరి వరుణ్ సినిమాను ఏం చేస్తాడో ??

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles