Rajini kochadaiiyaan screens in january 2014

kochadaiiyaan audio release,rajini,kochadaiyaan,pongal 2014, 1 Nenokkadine Movie Release Date, Mahesh Babu 1 Nenokkadine.

Kochadaiiyaan Audio Release in December, Rajini Starrer to Hit Screens in January 2014.

మహేష్ కి పోటీగా రజినీ వస్తున్నాడు

Posted: 11/15/2013 10:35 AM IST
Rajini kochadaiiyaan screens in january 2014

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ మహేష్ బాబుకు సవాల్ విసరబోతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ కి, సౌత్ ఇండియా సూపర్ స్టార్ ల మధ్య వార్ ఏంటని అనుకుంటున్నారా ? ఏం లేదండి. రజినీ కాంత్ నటిస్తున్న ‘కొచ్చాడయాన్ ’ సినిమాను సంక్రాంతి కానుకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇన్ని రోజులు విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వని సినిమా యూనిట్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు.

మొదట దీపావళి కానుకగా ఆడియోను , డిసెంబర్ 12 న రజనీ బర్త్ డే కానుకగా  సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరక పోవడంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచారు. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రిన్స్ ‘1’ నేనొక్కడనే సినిమాను జనవరి 10 తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే గనుక జరిగితే ప్రిన్స్ కి రజినీ సవాల్ విసరడం ఖాయం అంటున్నారు.  సంక్రాంతికి కోలీవుడ్‌లో స్టార్‌హీరోల సినిమాలు లేకపోవడంతో భారీస్థాయిలో కొచ్చాడయాన్ తీసుకురావాలని ప్రొడ్యూసర్ నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అయితే దీన్ని తెలుగులో కూడా విడుదల చేయనుండంతో థియేటర్ల విషయంలో కాస్త పోటీ నెలకొనే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles