I am not getting married priyanka chopra

Priyanka Chopra, priyanka chopra getting married, priyanka chopra marriage, priyanka chopra brother engaged, Siddharth Chopra, bollywood news

Actress Priyanka Chopra says she has not found the special one yet, with whom she would like to get married.

ఇంత వరకు అలాంటి మొగాడు దొరకలేదు

Posted: 11/05/2013 05:25 PM IST
I am not getting married priyanka chopra

బాలీవుడ్ ను తన అంద చందాలతో ఓ ఊపు ఊపుతున్న ప్రియాంక చోప్రా మనస్సు పెళ్లి వైపు మళ్ళిందని ఇటీవల బాలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈవార్తల పై ఇటీవలే ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...

ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, చూపంతా కెరియర్ పైనే ఉందని, నేను జీవితంలో ఇంకా స్థిరపడలేదని అంటూ చెప్పుకొచ్చిన ఆమె తనకు ఇంత వరకు తనకు కావాల్సిన మగాడే ఎదురు పడలేదని, నాకు కాబోయే వాడికి కొన్ని ప్రత్యేకతలు ఉండాలని, అలాంటి మగాడు తారస పడితే ఖచ్చితంగా ప్రేమిస్తానని చెప్పింది. ఇక మీడియాలో మాత్రం పెళ్లి పై రూమర్లు రావడం చూసి ఆశ్చర్య పోయానని, తనను పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళ నుండి కూడా ఒత్తిడి లేదని తెలిపింది.

తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ప్రేమ వివాహం పై వార్తలతో పాటు నా పై కూడా వార్తలు వచ్చి ఉంటాయని అనుకుంటున్నానని, నా సోదరుడి పెళ్లికి తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మూడేళ్లుగా తాను ప్రేమిస్తున్న కనిక మాథూర్ తోనే వివాహం జరుగుతుందని తెలిపింది. ఏది ఏమైనా ప్రియాంక పెళ్లి పై వస్తున్న వార్తలకు ఇకనైనా పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం గూండే, బాక్సర్ మేరికామ్ జీవిత కథ అధారంగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న చిత్రంలోనూ, జోయా అక్తర్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles