Ee rojullo fame reshma big fan of pawan

Ee Rojullo fame Reshma Big Fan Of Pawan , Reshma of Ee Rojullo, big fan of Pawan Kalyan, Actress Reshma Is Big Fan Of Pawan Kalyan

Ee Rojullo fame Reshma Big Fan Of Pawan , Reshma of Ee Rojullo, big fan of Pawan Kalyan, Actress Reshma Is Big Fan Of Pawan Kalyan

రేష్మ పవన్ కళ్యాణ్ కి ట్రై చేస్తుంది

Posted: 11/05/2013 12:39 PM IST
Ee rojullo fame reshma big fan of pawan

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటించి కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్న చిన్నా చితకా హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో ఒక్క సినిమాలోనైనా నటించాలని కలలు కంటారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా వారిని పొగడ్తలతో ముంచెత్తడం లేదా ఆయనంటే నాకు ఎంతో అభిమానం... ఆయనకు నేను పిచ్చా ఫ్యాన్ అని ఇలా ఏవేవో చెప్పేస్తుంటారు. ఇక టీవీ ఛానల్ కి ఇచ్చే ఇంటర్యూల్లో మనసు విప్పి మాట్లాడతారు.

అలా అయినా సదరు హీరోల కంట్లో పడక పోతామా ? ఏ దర్శక నిర్మాత అయినా ఆయన ప్రక్కన నటించమని అడగక పోతాడా ? ఎక్కడో చిన్న ఆశ. ఇప్పుడు ఈరోజుల్లో ఫేం రేష్మ కూడా అదే ఫాలో అవుతుంది. ఇటీవల ఓ సందర్భంలో మీకు ఇష్టమైన హీరో ఎవరంటే .... ఇంకెవరు పవన్ కళ్యాణ్ అని ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేసింది. నేను ఆయనకు వీరాభిమానిని.

పవన్ కల్యాణ్ గారు నటించిన గబ్బర్ సింగ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇటీవల ఈమె నటించిన సినిమాలో కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ గా నటించాను కూడా. ఆయన పేరు వింటేనే నాకు ఏదేదో అయిపోతుంది అని చెప్పుకొచ్చిన ఈమె ప్రిన్స్ మహేస్ పై కూడా మనస్సు పారేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. మరి వీరిద్దరు ఈ అమ్మడు మాటలకు పడిపోయి భవిష్యత్తులో ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles