Venki uncle role in charan movie

Venkatesh and Ram Charan, Venki uncle role, Naga Babu, Krishna Vamsi, Charan uncle venki,Babayi role

Venkatesh and Ram Charan will share screen space in Krishna Vamsi upcoming multi-starrer.

వెంకటేష్ అంకుల్ పాత్రలే చేస్తాడా ?

Posted: 11/04/2013 03:45 PM IST
Venki uncle role in charan movie

హీరో వెంకటేష్ ఇటీవలి కాలంలో సింగిల్ స్టారర్ సినిమాల కంటే మల్టీస్టారర్ సినిమాల్లో నే ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే. సింగిల్ స్టార్ గా సినిమా తీస్తే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం పెట్టిన పెట్టుబడే రావడం లేదు. అందుకే ఇతన్ని సింగిల్ గా పెట్టి సినిమా తీసేవారు చాలా తక్కువయ్యారు.

ఇప్పటి వరకు అన్నయ్య పాత్రల్ని ఎన్నుకొని ప్రేక్షకుల్ని అలరిస్తున్న వెంకటేష్ మెల్లిమెల్లిగా అంకుల్ పాత్రల్లో కూడా నటించడానికి సిద్దం అవుతున్నాడని తెలుస్తుంది. మహేష్, రామ్ సినిమాల్లో అన్నయ్య పాత్రలు పోషించిన వెంకీ త్వరలో చరణ్ - క్రిష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అంకుల్ గా కనిపించబోతున్నాడని తాజా సమాచారం.

మొన్నటి వరకు అంకుల్ పాత్రలో అయితే చేయనని చెప్పి తప్పుకున్న వెంకీ చివరికి ఈ పాత్రలో నటించడానికి సిద్ధం అయ్యాడని అంటున్నారు.  ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రిగా నాగబాబు నటిస్తున్నాడని, సినిమాల్లో చేసేవి కల్పిత పాత్రలు మాత్రమేనని, తాము చేసిన పాత్రలు అలా వరుసలు పెట్టి చూడరాదని, సినిమా కాబట్టి ఏ పాత్ర నచ్చితే అది చేసుకుంటూ పోవాలని అని సమాధానం ఇచ్చాడు.

మొన్నటి వరకు అలక వీడిన వెంకీ ఇప్పుడు అంకుల్ గా కూడా చేయడానికి భారీ పారితేషికమే తీసుకున్నట్లు చెబుతున్నారు. బండ్లగణేష్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles