Director varma gushes over blockbuster

Director Varma gushes over blockbuster, varma comments on war film, director ram gopal varma, assistant director to bilal lashari

Saw pakistani film Waar ..stunned beyond belief..i just want to leave direction nd go to pakistan to assist its director Bilal Lashari.

‘వార్ ’ సినిమా పై వర్మ

Posted: 10/28/2013 11:16 AM IST
Director varma gushes over blockbuster

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటి దులానందం చాలా ఉన్న విషయం గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడు షోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కామెంట్లు విసిరే వర్మ ఇప్పుడు మరో హాట్ కామెంట్ చేసి తాను పాకిస్థాన్ కి సపోర్ట్ ఇస్తున్నానని చెప్పకనే చెప్పాడు. ఇటీవల ఆయన పాకిస్థాన్ దర్శకుడు ‘బిలాల్ లషారీ ’ దర్శకత్వం వహించిన ‘వార్ ’ చిత్రాన్ని చూశాడట. ఈ చిత్రం వర్శకు తనకు తానే నమ్మలేనంత ఆశ్చర్యాన్ని కలిగించిందట.  దీని పై తన స్పందనలు తెలుపుతూ... చిత్రం చూసిన తర్వాత డెరైక్షన్ వదిలేసి పాకిస్తాన్ వెళ్లి ఆ చిత్ర దర్శకుడు బిలాల్ లషారీ వద్ద అసిస్టెంట్‌గా చేరాలనిపించింది.

భారతీయ దర్శకులు గొప్పవాళ్లమనే భావన నుంచి బయటపడాలి. అంతేకాకుండా పాకిస్తానీ చిత్రాలపై సీరియస్‌గా దృష్టి సారించి, వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాలని ఓ ఉచిత సలహా కూడా పారేశాడు. భారతీయుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న ఆ సినిమా పై అనేక విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. భారతీయ చిత్ర ప్రముఖులకు ‘వార్ ’ చిత్రం కాపీని పంపి పుణ్యం కట్టుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వర్మ. అయినా వర్మకు ఏ టాపిక్ దొరకనట్లు... అలాంటి సినిమా పై కామెంట్లు చేయడం పబ్లిసిటీ స్టంట్ కోసమే అని కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles