Ram charan yevadu movie postponed reasons

ram charan yevadu movie postponed reasons, Yevadu Movie Postponed Again, yevadu postponed, Yevadu movie release postponed

ram charan yevadu movie postponed reasons

‘ఎవడు ’ సినిమాకు కలిసి నెలలు

Posted: 10/26/2013 07:52 PM IST
Ram charan yevadu movie postponed reasons

ఏ ముహూర్తాన మొదలైందోగానీ రామ్ చరణ్ నటించిన ఎవడు. సినిమా ఇంత వరకు విడుదల కాలేదు. ఎప్పుడో షూటింగు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా ల్యాబ్ లోనే మూలుగుతుంది. ఈ సినిమా జులై 31 తేదీన విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు తెలంగాణ ప్రకటనతో ఇక్కసారిగా మారి పోవడంతో సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.

 

దీంతో ఈ సినిమాను ఆగస్ట్‌, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విడుదల చేయాలని చూసినా పరిస్థితులు అనుకూలించలేదు. చివరకు దీన్ని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని ప్రకటించాడు దిల్ రాజు. ఇప్పుడు డిసెంబర్ నెలలో కాకుండా జనవరి నెలలో సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నాడట. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నవంబర్, డిసెంబర్ నెలలు అంతగా అచ్చిరావు.

 

ఎలాగు ఇన్ని రోజులు ఆగాం మరి కొన్ని రోజులు ఆగి విడుదల చేస్తే పోయేదేముందని నిర్మాత ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ , బన్ని, నితిన్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చరణ్ సినిమా కూడా వచ్చి చేరింది. సంక్రాంతికి మహేష్ సినిమా రావడం తప్పని సరి. ఇక బన్ని, నితిన్ వస్తాడా అనేది కన్ ఫర్మ్ కాలేదు. ఆ రెండు సినిమాలను బట్టి ఈ సినిమా డేటును ఫైనల్ చేస్తాడట దిల్ రాజు. అన్ని సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు దొరకడం కష్టమౌవుతుందేమో ?

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles