Venky ram masala movie doubtful for november 1st

Venky-Ram Masala movie doubtful, Masala movie doubtful for November 1st, masala doubt for deepavali,masala,ram,venkatesh, Masala doubtful for Deepavali

Venky-Ram Masala movie doubtful for November 1st.

‘మసాలా ’ ఆ రోజు రావడం డౌటే ?

Posted: 10/21/2013 06:03 PM IST
Venky ram masala movie doubtful for november 1st

టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కి తగిన విధంగా రెండవ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘వెంకటేష్ - రామ్ ’ ల  ‘మసాలా ’ చిత్రం మరోసారి వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. మొదట ఈ సినిమా ‘మసాల ’ ఘాటును దసరాకే ప్రేక్షకులకు చూపిద్దామని అనుకున్నారు. అప్పుడు పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ సినిమా నవంబర్ 1వ తేదీకి ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే అప్పుడు కూడా రావడం కష్టమే అనేది తాజాగా ఫిలింనగర్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త. 

దీనికి కారణం ఏంటట అంటే... ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ రిపోర్టు వంటి పనులు అనుకున్న తేదీ లోపు అవ్వడం కష్టం కాబట్టి ఈ సినిమాను మరో వారం పాటు గానీ, రెండు వారాల పాటు అంటే ఎనమిదవ తేదీన కానీ, పదిహేనవ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. కానీ కొంతమంది మాత్రం ఈ సినిమాను వాయిదా వేయడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు. నాగార్జున నటించిన ‘భాయ్ ’ హిట్ టాక్ వస్తే సినిమాకు అనుకున్నన్ని థియేటర్లు దొరకడం, సినిమా వసూళ్ళ పై కూడా ప్రభావం చూపుతుందని భావించే పోస్ట్ పోన్ చేసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles