Sampath nandi next film chota mestri with ram charan

Sampath Nandi next film Chota Mestri with Ram Charan, Ram Charan, Sampath Nandi, Chota Mestri, Chota Mestri movie news, Chota Mestri ram charan

Sampath Nandi next film Chota Mestri with Ram Charan, Ram Charan, Sampath Nandi, Chota Mestri, Chota Mestri movie news, Chota Mestri ram charan

సంపత్ నంది మళ్ళీ చరణ్ తో

Posted: 10/18/2013 11:34 AM IST
Sampath nandi next film chota mestri with ram charan

   టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి కి అంత పేరు రావడానికి ఆయన సినీ కెరియర్లో కొన్ని సినిమాలు దోహందం చేశాయని చెప్పవచ్చు. అలాంటి వాటిలో ఖైధీ, ముఠామేస్త్రీ లాంటివి ఉన్నాయి. 1993 లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ముఠామేస్త్రీ చిరంజీవికి ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. ఆ జనరేషన్ అయిపోయింది..
   ఈ జనరేషన్ లో ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ వచ్చాడు. తన తండ్రిలాగా ఇమేజ్ తెచ్చుకోవాలంటే అలాంటిది ఒక్క సినిమా అయినా చేయాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి మాస్ కథ తోనే ఓ స్ర్కిప్టు రెడీ అవుతోందని, దానికి ‘చోటా మేస్త్రీ ’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారని అంటున్నారు. . ఆ మధ్యన ‘రచ్చ ’ సినిమాతో చరణ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది అలాంటి కథను ఒక్కటి తయారు చేశాడని, దానికి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తరుపరి వర్క్ లో మునిగిపోయాడని  అంటున్నారు.
   మొన్నటి వరకు సంపత్ నంది పవన్ కళ్యాణ్ నే ‘చోటా మేస్ర్తీ ’ గా చూపించబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ని అబ్బాయికి ఫిక్స్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్ - 2’ చిత్రానికి రెడీ అవుతున్న సంపత్ నంది తరువాతి ప్రాజెక్టు మళ్ళీ చరణ్ తోనే ఉంటుందని అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles