Pawan ad movie has collected rs 20 crores in nizam

Pawan AD movie has collected Rs 20 crores in nizam, Attarintiki Daredi crosses 20 crore mark in Nizam, Attarintiki Daredi nizam collections, Attarintiki Daredi collects 20 crores in nizam, Attarintiki Daredi Tollywood records, Magadheera collections in Nizam.

Pawan Kalyan Attarintiki Daredi film has crossed 20 Crores collection in Nizam area and this is only film post Magadheera to collect such huge.

మగధీర రికార్డులను బద్దలు కొట్టే దిశగా...

Posted: 10/16/2013 02:31 PM IST
Pawan ad movie has collected rs 20 crores in nizam

టాలీవుడ్ బాక్సాఫీసు కలెక్షన్లలో నైజాం ఏరియాది ప్రత్యేక స్థానం. ఈ ఏరియాలో మంచి వసూళ్ళు సాధించిన సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయం. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రాజమౌళి - రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర ’ సినిమా ఈ ఏరియాలో 24.5 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డు వసూళ్లు సాధించిన సినిమాగా కొనసాగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా నైజాం కలెక్షన్లలో దుమ్ము రేపుతుంది. ఈయన నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా నైజాంలో 20 కోట్ల రూపాయలను వసూలు చేసి తన పవన్ స్థామినా అంటే ఇది అని నిరూపించుకుంటుంది .

ఇప్పటి వరకు ఈ సినిమా 65 కోట్లకు పైగా వసూళ్ళు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా ఒక్క మన రాష్ట్రంలోనే 50 కోట్ల రూపాయలు వసూలు చేసిట్లు చెబుతున్నారు. ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా వసూళ్ళ పరంగా దూసుకుపోతుంది.

సీమాంధ్ర ఉద్యమం, ఫైలిన్ తుఫాన్ ప్రభావం ఈ సినిమా పై ఎటువంటి ప్రభావం చూపలేక పోయాయి. వసూళ్ళు ఇలాగే కొనసాగితే ఈ సినిమా 100 కోట్లు దాటినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు. మొన్నటి కి మొన్న పవన్ కళ్యాణ్ ‘థ్యాంకూ మీట్ ’ లో కూడా ఈసినిమా 100 కోట్లు దాటినా అనే సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల జోరును చూస్తుంటే పవన్ మాట నిజం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles