Mani ratnam to launch mohanlal son

Dulquer Salmaan, Gautham, Kadal, Karthik, Malayalam superstar, Mammooty, Mani Ratnam, Mohanlal, Ratnam to launch Mohanlal son, Director Mani Ratnam to launch Mohanlal son,

The Malayalam superstar production house is named after his son, Pranav, and now he all set to take up acting In his last film Kadal, Mani Ratnam.

మణిరత్నం సినిమా ఈ సారైనా ?

Posted: 10/03/2013 08:20 PM IST
Mani ratnam to launch mohanlal son

పూర్వం మనకో సామెత ఉంది. ‘కడివెడంత గుమ్మడి కత్తిపీటకు లోకువ ’ అన్నట్లు ఎంత పెద్ద దర్శకుడు అయినా ప్లాపు సినిమా తీస్తే జనాలు అనరాని మాటలు అంటారు.. ఇప్పడు ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం పరిస్థితి అలాగే తయారు అయింది. ఈయన ఆ మధ్య లో ఒకప్పటి ప్రముఖ హీరో కార్తీక్ తనయుడు అయిన గౌతమ్ ని హీరోగా, ప్రముఖ వెండితెర హీరోయిన్ రాధ కూతురు అయిన తులసిని పెట్టి ‘కడలి ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఆ సినిమా సముద్రంలోని అలల లాగా కొట్టుకొని పోవడమే కాకుండా, మణిరత్నం పరువు కూడా సముద్రంలో కలిసి పోయింది. దీంతో అందరు గౌతమ్ కార్తీక్, తులసీ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ వారికి ఓ మోస్తరు గానే అవకాశాలు వస్తున్నాయి. దీంతో మరో హీరో అయిన మోహన్ లాల్ తన కొడుకును మణి రత్నం చేతిలో పెట్టడానికి సిద్ధం అయ్యాడు. మణి కూడా ఈయన్ను వెండితెరకు పరిచయం చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. మరి ఈసారి కూడా ఒక రావణ్, కడలి లాంటి స్టోరీతో సినిమా తీసి ఈ సారి ఉన్న క్రేజ్ పోడగొట్టుకోడు కదా అని సినీ జనాలు అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో షూటింగు మొదలవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles