Ram gopal varma sensational comments on pawan kalyan

Ram Gopal Varma Sensational Comments on Pawan Kalyan, ram gopal varma comments on pawan kalyan, rgv tweet on pawan kalyan, ram gopal varma tweets, ram gopal varma said biggest idiot

Ram Gopal Varma Sensational Comments on Pawan Kalyan, ram gopal varma comments on pawan kalyan, rgv tweet on pawan kalyan, ram gopal varma tweets, ram gopal varma said biggest idiot

పవన్ ఓ ఫూల్ : వర్మ

Posted: 10/01/2013 06:12 PM IST
Ram gopal varma sensational comments on pawan kalyan

రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడిగానే కాకుండా, సంచలన వ్యాఖ్యలకు మారు పేరు గా నిలిచాడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి అప్పుడప్పుడు ట్విట్టర్లో హాట్ హాట్ కామెంట్స్ చేసే వర్మ గత నెల రోజుల నుండి వార్తల్లో లేడే అనుకునేలోపే మరో బాంబ్ పేల్చేస్తాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ పై రాజకీయాల్లోకి రావాలంటూ, పార్టీ పెట్టాలంటూ కామెంట్ చేసిన వర్మ నేడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పై మరో బాంబు పేల్చాడు. ఈ సారి ‘ఫూల్ ’ గీల్ అంటూ కాస్త వల్గర్ భాషను కూడా వాడాడు.

ప్రస్తుతం పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రం ఘన విజయం సాధించి, రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్న ఈ చిత్రం పై కామెంటు చేస్తూ... పవన్ కళ్యాణ్  ఓ ఎవరెస్ట్ అని. అతనికున్న శక్తి తనకు తెలియడం లేదని దానికి నిదర్శనం పవన్ సినిమాకు వస్తున్న కలెక్షన్లే అని, ఇంత ఫాలోయింగ్ ఉన్న వర్మ ఇప్పటికైనా పార్టీ పెట్టాలని, ఇంత ఉండి కూడా పార్టీ పెట్టకపోతే ‘ఫూల్ ’ తో సమానం అని అనేశాడు.

గతంలో పవన్ ని గాంధీతో పోల్చిన వర్మ ఇతనికి నిజంగా ఫ్యానా. లేక ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థను మార్చగల శక్తి ఇతనిలో ఉందని గుర్తించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో కానీ పవన్ పై చేసిన ప్రతి సారి హైలెట్ అవుతున్నాడు. ఈయన స్థామినా ఫ్యాన్స్ కన్నా వర్మకే ఎక్కువ తెలిసినట్లుందని జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles