Attarintiki daredi breaks all records

Attarintiki Daredi breaks all records, Pawan Kalyan|Attarintiki Daredi USA , Attarintiki Daredi theaters, Attarintiki Daredi collections, Attarintiki Daredi box office,Box Office Collection,Pawan Kalyan,Attarintiki Daredi

Attarintiki Daredi breaks all records, Pawan Kalyan|Attarintiki Daredi USA , Attarintiki Daredi theaters, Attarintiki Daredi collections, Attarintiki Daredi box office,Box Office Collection,Pawan Kalyan,Attarintiki Daredi

ఇది పవర్ స్టార్ సినిమా స్టామినా

Posted: 10/01/2013 12:29 PM IST
Attarintiki daredi breaks all records

రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, విడుదలకు ముందే పైరసీకి గురై ఎన్నో ఆటుపోట్ల మధ్య విడుదల అయిన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది ’ చిత్రం తన హవాని కొనసాగిస్తూ.... టాలీవుడ్ లో కొత్త రికార్టులు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుతుంది. ఈ సినిమా అద్భుతమైన టాక్ అమోఘమైన వసూళ్ళను సాధిస్తూ ఇప్పటి వరకు బాక్సాఫీసును షేక్ చేసిన సినిమాల రికార్డుల్ని తొలి మూడు రోజుల్లోనే బద్దలు చేసింది.  ఇప్పటికే నాయక్, సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు, బాద్ షా వంటి చిత్రాలను అధికమించిన ఈ సినిమా తొలి వారం పూర్తయ్యే సరికి యాబై కోట్ల  క్లబ్ లో చేరిపోవడం పెద్ద విషయమేమి కాదంటున్నారు. ట్రేడ్ విశ్లేషకులు. రెండో వారం కూడా ఇదే ఊపులో కొనసాగితే టాలీవుడ్ లో కొత్త రికార్డును స్రుష్టించడం ఖాయం అంటున్నారు. నిన్నటి వరకు ఈ సినిమాకు ఏరియా వారిగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 7.80 కోట్లు, సీడెడ్ 4.48 కోట్లు, వైజాగ్ 2.20 కోట్లు, క్రిష్ణా 1.53 కోట్లు, గుంటూరు 2.27 కోట్లు, నెల్లూరు 1.03 కోట్లు, గోదావరి జిల్లాల్లో 3.20 కోట్లు రాబట్టగా, మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో కూడా 2.65  కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 1 కోటి, అమెరికాలో 6.5 కోట్లు, మిగతా దేశాలన్ని కలిపి 0.90 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక్కడ విశేషం ఏంటంటే...ఒక ఆంధ్ర ప్రదేశ్ లోనే మూడు రోజుల్లో 22 కోట్లకు పైగా రావడం చూస్తుంటే పవన్ సినిమాకు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక లెక్కలు బయటకు రానున్నాయి. ఈ సినిమా వసూళ్ళ సునామీ స్రుష్టిస్తుండంటో నిర్మాతలు, దర్శకులు తెగ సంతోషపడి పోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles