Priyanka chopra item in ramleela

Priyanka-Chopra-item-In-Ramleela, priyanka chopra, ranveer singh, deepika pdukone, sanjay leela bhansali, romance, bollydood, films, item song, item number

Priyanka-Chopra-item-In-Ramleela, priyanka chopra, ranveer singh, deepika pdukone, sanjay leela bhansali, romance, bollydood, films, item song, item number

రామ్ లీలా ఐటెంలో అందాల ఆరబోత

Posted: 09/30/2013 09:01 PM IST
Priyanka chopra item in ramleela

బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న చిత్రం ‘రామ్ లీలా ’ ముంబయి సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కారణం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రముఖ రచయిత రాసిన ‘షేక్స్ పియర్ ’ నవలల్లో బాగా పాపులర్ అయిన ‘రోమియో జూలియెట్ ’ నాటకం ఆధారంగా రూపొందిస్తున్న ‘రామ్ లీలా ’ చిత్రం కావడమే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే పలువురిని ఆకట్టుకోవడమే కాకుండా ప్రశంసలు పొందాయి కూడా. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన రణవీర్, దీపికాల రొమాంటిక్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలే కాకుండా, ప్రియాంక చోప్రా ఇందులో ఐటెం పాటకు చిందులేసిందట. ముంబయ్‌లోని ఫిల్మ్ సిటీ స్టూడియోస్‌లో రూపొందించిన ఓ భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. విష్ణు దేవా నృత్యదర్శకత్వంలో రూపొందిన ఈ పాటలో ప్రియాంక అదిరిపోయే స్టెప్స్ వేశారట. ఆమె చాలా హాట్‌గా కనిపించనుందని సమాచారం. ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే జంజీర్ లో చెర్రీతో ఘాటు రొమాన్స్ చేసిన ప్రియాంక ఇందులో మరింత రెచ్చిపోయిందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles