Ntr support to bvsn prasad

NTR jr to extend his support to BVSN PRASAD, ntr support to BVSN prasad, Athaarintiki daaredi movie review

NTR jr to extend his support to BVSN PRASAD, ntr came up to extend their support to BVSN prasad who was hit by the piracy of Athaarintiki daaredi.

ప్రసాద్ కి జూనియర్ ఎన్టీఆర్ అండ

Posted: 09/24/2013 03:31 PM IST
Ntr support to bvsn prasad

టాలీవుడ్ సినిమా హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. అందుకు తగ్గట్లుగానే పలు సందర్భాల్లో తానేంటో నిరూపించుకున్నాడు కూడా. ఆ మధ్యన తన సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చిన అభిమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఇక్కడ అసలు మేటర్ ఏంటంటే.... పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమాను నిర్మించిన బి.వి.ఎస్.యస్. ప్రసాద్ కు ఈ సినిమా పుటేజి ఫైరసీ కి గురికావడంతో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ నిర్మాతను పలుసార్లు ఫోన్ చేసి ధైర్యం చెప్పడమే కాకుండా, నేను అండగా ఉంటానని హామి ఇచ్చాడట. అంతే కాకుండా సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా నిర్మాణాన్ని ఈయనకే అప్పగించాడట. ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యంలో నిర్మాత ప్రసాద్ కాస్త ఊరట చెంది, అత్తారింటికి దారి వెతికే పనుల్లో బిజీగా ఉన్నాడని అంటున్నారు. ఇలాంటి హీరోలు ఉండే ఇండస్ట్రీలో నిర్మాతలకు ఎలాంటి సమస్యలు రావని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles