Richa gangopadhyay rejects balakrishna offer

Richa Gangopadhyay Rejects Balakrishna offer, Richa Gangopadhyay Rejects second chances, richa gangopadhyay prority first choice, richa gangopadhyay focus tollywood

Richa Gangopadhyay Rejects Balakrishna offer, Richa Gangopadhyay Rejects second chances, richa gangopadhyay prority first choice, richa gangopadhyay focus tollywood

బెంగాలీ బ్యూటీ దానికి ఒప్పుకోనంటుంది

Posted: 08/14/2013 08:47 PM IST
Richa gangopadhyay rejects balakrishna offer

బెంగాలీ బ్యూటీ రీచా గంగోపాద్యాయ ‘మిరపకాయ్ ’ సినిమా లో , బెంగాలీ అందాల ఘాటు చూపించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత పలువురి స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ కాలాన్ని వెల్లదీస్తుంది. కాజల్, సమంతాల లాగా స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోకపోయినా ఈ అమ్మడుకి మంచి డిమాండే ఉంది. అలాంటి ఈ భామ అందరి హీరోయిన్ల లాగా వచ్చిన ఏ అవకాశాన్ని అయినా వెంటనే ఒప్పేసుకోకుండా ఆచి తూచి వ్యవహరిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడుకు చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లు వచ్చాయి. కానీ సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసేది లేదని ఏ మొహమాటం లేకుండా తిరస్కరించేసిందట. అలా ఈమధ్య ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో ప్రణీత పోషించిన పాత్రనూ, మంచు విష్ణు నటిస్తున్న ‘ దూసుకెళ్తా ’  సినిమాలోని పాత్రనూ, తాజాగా బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలోని పాత్రనూ రిచా తిరస్కరించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. సినిమాల విషయంలో నాకంటూ కొన్ని కండీషన్లు ఉన్నాయి. వాటిని దాటి నేను ఎప్పుడు ప్రవర్తించను. ఇకపై కేవలం లీడ్ హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానని తెగేసి చెబుతోన్న బెంగాలీ బ్యూటీకి ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles