టాలీవుడ్ లో నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్న ‘బాలయ్య ’ సెంచరీ చేసి సినిమాల్లో నుండి రిటైర్మెంట్ ప్రకటించాలనే ఉద్దేశ్యంతో సెంచరీకి మిగిలిఉన్నసినిమాలను త్వరగా పూర్తి చేయాలని భావించి ఆ మద్య వరుస సినిమాలు చేస్తూ పోయాడు.కానీ తీరా అవి బాక్సీఫీసు వద్ద బోల్తా కొట్టడంతో కాస్తంత వెనక్కి తగ్గి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో ‘రూలర్ ’ సినిమాను చేస్తున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.... ఈయన సరసన నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదు. షూటింగు ప్రారంభం అయి చాలా రోజులు అయినా ఇంత వరకు హీరోయిన్ ఖరారు కాలేదు. ఆ మధ్య ఈయన సరసన పలువురు హీరోయిన్లు నయనతార,కాజల్, ఇషా చావ్లా వంటి వారి పేర్లు వార్తలకెక్కాయి. కానీ వారందరు ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చారు. దీంతో బాలయ్యకు హీరోయిన్ దొరకడం కష్టమే అనే టాక్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీతమ్మగా పేరు తెచ్చకున్న ‘అంజలి ’ని కధానాయికగా తీసుకున్నట్లు వార్తలు. ఇద్దరు కధానాయికలు కావాల్సిన ఈ సినిమాకు ఇప్పటికే సోనాల్ చౌహాన్ ని తీసుకున్నారు. ఇప్పుడు అంజలిని తీసుకున్నారు. మరి వీరిద్దరిలో మొయిన్ హీరోయిన్ ఎవరో సస్పెన్స్ గా ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more