Bhaag milkha bhaag enters rs 100 crore club

bhaag milkha bhaag, 100 crore club farhan akhtar, sonam kapoor, entertainment, bollywood,

Rakeysh Omprakash Mehra biopic on athlete Milkha Singh - Bhaag Milkha Bhaag - has crossed the Rs 100 crore mark. The Farhan Akhtar, Sonam Kapoor-starrer has earned around Rs 104 crore.

వందకోట్లు వసూలు చేసింది

Posted: 08/06/2013 01:37 PM IST
Bhaag milkha bhaag enters rs 100 crore club

సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకటప్పటి లాగా స్టార్ హీరో సినిమా వంద రోజులు ఆడే పరిస్ధితి లేదు. హీరోతో సంబంధం లేకుండా ఏ సినిమా 100 కోట్ల వసూళ్లు సాధిస్తే అదే సూపర్ హిట్. అదే సినిమాకు ల్యాండ్ మార్క్.. స్టేటస్ సింబర్. ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినా కానీ 100 కోట్ల మార్క్ ని తాకితే సినిమా హిట్టే అనే పరిస్దితికి వచ్చింది. మన టాలీవుడ్ లో ఇంత వరకు ఏ సినిమా 100 కోట్ల మార్క్ ను తాకలేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలు ఆ క్లబ్బులో చేరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఇప్పటివరకు ‘రేస్ 2, ఆషికి 2, ఏ జవానీ హై దివానీ ’ చిత్రాలు ఈ 100 కోట్ల మార్క్ ను తాకాయి. తాజాగా ఈ మధ్య వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్ ’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా కలెక్షన్లు మొదటి వారం స్లోగానే ఉన్నప్పటికీ, తర్వాత మంచి రివ్యూలు రావడంతో ఇప్పుడు నాలుగు వారాల ప్రదర్శన పూర్తయ్యేసరికి 100 కోట్ల క్లబ్బులో చేరింది. 'ఢిల్లీ 6' ఫేం  రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిల్కా సింగ్ పాత్రను ఫరాన్ అక్తర్ పోషించాడు. ఈ చిత్రం స్పూర్తిదాయకంగా వుందంటూ పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాలలో దీనికి వినోదపు పన్నును కూడా మినహాయించారు. సినిమా బాగుంటే జనాలు ఆదరిస్తారనడానికి ఇదొ ఉదహారణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles