Bhai director veerabhadram to direct allu arjun

Bhai director Veerabhadram to direct Allu Arjun, Veerabhadram to direct Allu Arjun, Veerabhadram Allu Arjun film, Director Veerabhadram, Allu Arjun, Nagarjuna

Bhai director Veerabhadram to direct Allu Arjun, Veerabhadram to direct Allu Arjun, Veerabhadram Allu Arjun film, Director Veerabhadram, Allu Arjun, Nagarjuna

‘భాయ్ ’ దర్శకుడికి మెగా ఛాన్స్

Posted: 07/24/2013 06:08 PM IST
Bhai director veerabhadram to direct allu arjun

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల కంటే ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న చిన్న దర్శకులే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది చిన్న దర్శకులు పెద్ద హీరోలతో సినిమాలు తీసి మంచి హిట్లు ఇచ్చారు. తాజాగా ‘పూలరంగడు ’ సనిమా దర్శకుడు వీరభద్రమ్ నాగార్జునతో ‘భాయ్ ’ చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి జనాల్లో పాజిటివ్ టాక్ రావడంతో బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్మడు పోయాయి. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ దర్శకుడి కోసం పలువురు నిర్మాతలు క్యూ కడుతున్నారట. తాజాగా ప్రముఖ దర్శకుడు అయిన డి.వి.వి. దానయ్య సదరు దర్శకుడికి కథ లేకుండానే అడ్వాన్స్ కొట్టి, హీరో అల్లు అర్జున్ కోసం మంచి కథను తయారు చేసుకోమ్మని చెప్పాడట. యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ అంశాలు కలగలిసి ఉండాలని చెప్పడంతో అందుకు తగ్గట్లే కథను తయారు చేసుకునే పనిలో పడ్డాడట వీరభద్రమ్. సో... త్వరలో బన్నీ-దానయ్య-వీరభద్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles