Pawan kalyan attapur baba getup

pawan kalyan attapur baba getup, Pawan movie attarintiki daredi movie baba getup, hero pawan kalyan , pawan kalyan attapur baba, raveparty songs shooting

pawan kalyan attapur baba getup, Pawan movie attarintiki daredi movie baba getup, hero pawan kalyan , pawan kalyan attapur baba, raveparty songs shooting

బాబా అవతారం ఎత్తిన పవన్

Posted: 07/11/2013 07:10 PM IST
Pawan kalyan attapur baba getup

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిత్యం ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ‘ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా ‘ అనే డైలాగు ఫాలో అవుతున్నట్లుంది. అందులో తను తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ చిత్రంలో ఆయన వినూత్నమైన గెటప్ లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన ‘అత్తా పూర్  బాబా ’ అవతారంలో కనిపించబోతున్నాడట. గతంలో ఆయన ‘గుడుంబా శంకర్ ’ సినిమాలో పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తారు. ఈ సీన్ కి అప్పట్లో విపరీతమైన క్రేజ్ వచ్చంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో కూడా ఓ బాబా సన్నివేశం పెట్టాడట. దీనికి సంబందించిన ఓ ఫోటో నెట్లో హల్ చేస్తూ జనాల్లో క్రేజ్ ని సంపాదించుకుంటుంది. పవన్ కి తోడు కామెడీ సీన్ ను మరింత పండించడానికి బ్రహ్మానందం, అలీలు కూడా ఆయనతో జత కలవనున్నారని,  ఈ ముగ్గురి కాంబినేషన్లో  వచ్చే సన్నివేశాలు  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. ఈ సన్నివేశం చిత్రానికి మరింత హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగులో భాగంగా రేవ్ పార్టీలో నలుగురు భామలతో ఎంజాయ్ చేస్తున్న పవన్ సినిమా ఆగష్టులో విడుదల కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles