Aishwarya fires on using reentry

Aishwarya Fires on Using Reentry, Aishwarya rai re-entry, Aishwarya fire, Aishwarya Rai Latest Movies, Aishwarya rai Daughter Aaradhya, Aishwarya Rai latest Public

Aishwarya Fires on Using Reentry, Aishwarya rai re-entry, Aishwarya fire, Aishwarya Rai Latest Movies, Aishwarya rai Daughter Aaradhya, Aishwarya Rai latest Public

ఐష్ ఆంటీకి కోసం వచ్చింది

Posted: 07/10/2013 07:26 PM IST
Aishwarya fires on using reentry

ప్రపంచ అందాల సుందరి గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ కొన్ని రోజుల క్రితం పడ్డంటి బిడ్డకి జన్మనిచ్చి, ఆ తరువాత నుండి ముఖానికి రంగేసుకోకుండా వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈమె మళ్ళీ వెండితెర పై రీ ఎంట్రీ చేయబోతుందనే వార్తలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. తల్లి అయిన తరువాత ప్రముఖ జువెల్లరీ షాపు అయిన కళ్యాన్ జువెల్లర్స్ కి ప్రచారం చేయడానికి కమీట్ అయి, బుల్లితెర పై హల్ చేస్తూ తనలో ఏ మాత్రం అందాలు తగ్గలేదని చెప్పకనే చెప్పింది. ఇటీవల పూణేలో కళ్యాణ్ జువెల్లరీ బ్రాంచిని ప్రారంభించడానికి వచ్చిన ఐష్ ని మీడియా రీఎంట్రీ విషయం పై అడగ్గా, తాను సినిమా ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేదని, కొంత కాలం సినిమాలకు సైన్ చేయలేదు అంతే. అంత మాత్రానికి ‘రీ ఎంట్రీ' ట్యాగ్ తగిలించడం దేనికి అని కాస్తంత ఘాటుగా చెబుతూనే, వెండితెరకు దూరంగా ఉన్నంత మాత్రాన సినిమా రంగాన్ని వదిలేసినట్లు కాదని, ఒకవేళ నేను మళ్లీ ఏ సినిమాకైనా సైన్ చేస్తే మీడియాకు తెలియజేస్తానని చెప్పింది. ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, చాలా సంతోషంగా ఉన్నానని, మాతృత్వపు అనుభూతి ఎంతో హాయిగా ఉందని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ అంతగా బయటకే రాని ఈ  ముద్దుగుమ్మ. ఈమధ్యనే అన్నిటికీ అందంగా తయారై హాజరవడం లో పలువురు నిర్మాతలు ఐష్ ని తన సినిమాలో నటించమని వెంబడిపతున్నారట. . ఇటీవల కరణ్ జోహార్ ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించాడని, హృతిక్ రోషన్ హీరోగా రూపొందించే ‘శుద్ధి' అనే సినిమాలో నటించాల్సిందిగా కోరాడని సమాచారం. ఉన్న మాట అంటు ఉలుకెక్కవ అన్నట్లు, రీ ఎంట్రీ గురించి అడిగినందుకే ఇంత ఫీలవ్వాలా అని అక్కడి జనం అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles