Pawan kalyan hit sentiment tollywood heros

pawan kalyan, balupu, ravi teja, shruti hassan, anjali,mass hero, balupu film, pavankalyan, fame and name, imitation, allari naresh, nitin, gunde jari gallanthayyainde,.

Tollywood industry was quick to point out that Pawan Kalyan’s song worked as a lucky charm for the movie. Now, Ravi Teja has gone a step ahead. Not only did he use a song from Gabbar Singh, he also used visuals of Pawan Kalyan in Balupu.

ఆ హీరోల సినిమాలు పవన్ ఖాతాలోకే

Posted: 07/01/2013 11:45 AM IST
Pawan kalyan hit sentiment tollywood heros

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతం అయిన పవన్ ‘గబ్బర్ సింగ్ ’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఎన్ని సినిమాలు ప్లాపులు అయినా ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. అలాంటి పవన్ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ప్లాపులతో సమతమం అయ్యి కెరియర్ చివరి దశకు వచ్చిందనుకొన్న హీరోలకు ఈయనే దేవుడయ్యాడు. దిక్కయ్యాడు కూడా ? హీరో నితిన్ పవన్ వీరాభిమానిగా చెప్పుకుంటూ ఆయన పేరును ‘గుండెజారి గల్లంతయ్యిందే ’ సినిమాలో వాడుకొని సూపర్ హిట్ కొట్టాడు. ఇఫ్పుడు మాస్ రాజా రవితేజ కూడా తన తాజా సినిమా ‘బలుపు ’ లో కూడా పవన్ కళ్యాణ్ ని వాడేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ టాక్ రావడంతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడని, ప్లాపులతో ఉన్న హీరోలను ఈయన దేవుడిగా మారాడని అంటున్నారు. ఈ సినిమా విజయంతో ఊపిరి పీల్చుకున్న రవితేజ ను చూసిన కొందరు ప్లాపు హీరోలు తన సినిమాల్లో పవన్ కళ్యాణ్  పేరును వాడుకోవడానికి సిద్ధం అవతున్నట్లు ఫిలింనగర్ జనాలు అంటున్నారు. మరి ఈ పవన్ మేనియా టాలీవుడ్ లో ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి. ఇక ఆయన ఫ్యాన్స్ మాత్రం రవితేజ బలుపు, నితిన్ సినిమాను పవన్ ఖాతాలోనే వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles