Tapsee under water for 12 hours

munni 3 movie, tapsee heroine, tapsee risk scenes, tapsee daring, tapsee 12 hours spend, lawrance director.

Director Keeps Tapsee Under Water for 12 hours, muni 3 movie details, Director Ragahva Lawrence Keeps Tapsee Under Water for 12 hours.

తాప్సీ తెగువ చూపింది

Posted: 06/29/2013 01:00 PM IST
Tapsee under water for 12 hours

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి, ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న భామల నుండి పోటీని తట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తారు. ఇప్పుడు ఆ కోవలోకి తెల్ల పిల్ల తాప్సీ కూడా వచ్చి చేరింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా రోజుల అయినా, కెరియర్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్టు కొట్టలేదు. అయినా తెల్లతోలు అందాలను చూసి దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. ఇటీవలే ఈ అమ్మడుకు రాఘవ రారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన కాంచన సీక్వెల్ లో సినిమా అయిన మునిలో అవకాశం ఇచ్చాడు. దీంతో ఎగిరి గంతేసిన ఈ అమ్మడు ఎలాగైనా ఈ సినిమాతో హిట్టుకొట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని పరితపిస్తుంది. అందుకోసం ఈమె ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సై అంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. అక్కడ ఈమె కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.  ఓ సీన్ కోసం 12గంటలు నీళ్ళలో గడిపింది. అంతసేపు నీళ్లలో గడపడం వల్ల అందం, ఆరోగ్యం పాడవుతుందని, డూప్‌తో ఆ సీన్ చేద్దామని....దర్శక నిర్మాతలు చెప్పినా తాప్సీ వినకపోగా తానే చేస్తానని పట్టుబట్టిందట. దీని పై తాప్సీ మాట్లాడుతూ... నా కెరియర్ లోనే న్నడూ చేయని దమ్మున్న పాత్ర చేస్తున్నానని, ప్రేక్షకులను మెప్పిస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. మరి ఈ తెల్ల పిల్ల ఎంత తెగించి చేసినా సినిమా హిట్టు అయితేనే ఫలితం దక్కతుందని అనుకుంటున్నారు. చూద్దాం తాప్సీ 12 గంటల శ్రమకు ఫలితం ఏ మాత్రం దక్కుతుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles