Nandamuri balakrishna as kerala brahmin

Nandamuri balakrishna, balakrishna, gv, simha, balakrishna kerala brahmin

Balakrishna is currently busy acting in the direction of Boyapati Srinu. Latest buzz is that Balakrishna has given green signal to Actor turned director GV Sudhakar Naidu. He previously directed films like Hero and Ranga the Donga. Sources say that Balakrishna liked the powerful script readied by GV.

కేరళ బ్రాహ్మణుడిగా బాలయ్య

Posted: 06/28/2013 11:50 AM IST
Nandamuri balakrishna as kerala brahmin

నటుడు, దర్శకుడు అయిన జీవి ప్రేక్షకులకు సినిమాల్లో విలన్ గా మాత్రమే తెలుసు. వెండితెర పై అంత గంభీరంగా కనిపించే జీవీలో దర్శకత్వ ప్రతిభ కూడా ఉంది. చిన్న చిన్న పాత్రలు చేసే జీవి త్వరలో నందమూరి నటసింహం బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఫిలింనగర్ లో సంచరిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడట. ఈయన కేరళ బ్రాహ్మణుడి పాత్ర చేయబోతున్నట్లు చెబుతున్నారు. క్షత్రీయ వంశానికి చెందిన ఈయన కొన్ని కారణాల వల్ల బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతాడు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరూ సినిమా చేయలేదు. బాలయ్యకు వీరాభిమాని అయిన నేను బాలయ్యకు కథ వినిపించగానే ఒప్పుకున్నాడని జీవి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు తీస్తున్న జీవి మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక బాలయ్య సినిమా బోయపాటి సినిమా తరువాత ఉంటుందని అంటున్నారు. ఇటీవలే ఓ పెద్ద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పాడు. ఏది ఏమైనా ఒక చిన్న నటుడికి బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఆఫర్ రావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles