Samantha getting mother feeling

samantha acress, samantha mother feeling, samantha tweet, samantha enjoy small baby

Samantha getting mother feeling in shooting.

తల్లి కావాలనే కోరిక కలిగిందట

Posted: 06/15/2013 10:43 AM IST
Samantha getting mother feeling

టాలీవుడ్ లో లక్కీగాళ్ అయిన హీరోయిన్ సమంతా పేరు ఈ మధ్య వార్తల్లో నిత్యం వినిపిస్తుంది. ఇప్పటికే అందరికన్నా బిజీ హీరోయిన్ గా ఉంటూ, దాదాపు రెండు సంవత్సరాల వరకు ఖాళీ లేకుండా సినిమాలు కమీట్ అయిన ఈ అమ్మడు హీరో సిద్దార్థను పెళ్ళి చేసుకోబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లిని వాయిదా వేస్తుందని అంటున్నారు. ఈ మధ్య సమంతా ఓ సినిమాలో చిన్న పిల్లాడితో కలిసి నటించింది. చిత్రీకరణ సమయంలో ఆ పిల్లాడితో సమంతా కాసేపు గడిపింది. ఈ విషయం పై సమంతా ట్వీట్ చేస్తూ ఆ పిల్లాడితో ఉన్నంత సేపు తనకు అమ్మలాగా ఫీలింగ్ కలిగిందని, షూటింగ్ అయిపోయిన తరువాత ఆ పిల్లాడ్ని వదిలిపెట్టాలంటే అదోలా అనిపించిందని చెప్పుకొచ్చింది.

ఈ విషయం విన్న టాలీవుడ్ జనాలు ఈమెకు తల్లి కావాలనే తొందర బాగానే ఉందని, అలాంటప్పుడు సిద్దార్థను పెళ్లి చేసుకొని ఆ ముచ్చటేదో తీర్చుకోవచ్చు కదా అని అంటున్నారు. ఈ ట్వీట్స్ పై దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. సమంతా త్వరగా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటే డ్యాన్స్ చేయాలని ఉందని తెలిపాడు. దీంతో కాస్తంత గట్టిగానే రిప్లై ఇస్తూ తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles