Prabhas rs 20 crore package

Prabhas getting huge remuneration for Bahubali, Rajamouli Prabhas Bahubali, Prabhas Bahubali Remuneration, Prabhas 20 crore Remunerartion for Bahubali

Prabhas getting huge remuneration for Bahubali, Rajamouli Prabhas Bahubali, Prabhas Bahubali Remuneration, Prabhas 20 crore Remunerartion for Bahubali

ప్రభాస్ పారితోషికం 20 కోట్లా ?

Posted: 05/24/2013 11:01 AM IST
Prabhas rs 20 crore package

టాలీవుడ్ టాప్ హీరోల పారితోషికం ఎంతా ? ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడు ? అంటే ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ 12 కోట్లు తీసుకుంటున్నాడని, మహేష్ బాబు 14 కోట్లు తీసుకుంటున్నాడని, పవన్ కళ్యాణ్ 12 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడని, ఈ మధ్య రామ్ చరణ్ కి బండ్ల గణేష్ 17 కోట్లు ఆఫర్ చేశాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా వీరందరిని మించే పారితోషికం ప్రభాస్ తీసుకుంటున్నాడని సినిమా వర్గాల టాక్. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘బహుబలి ’ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడని, అంత ఇచ్చేందుకు కూడా నిర్మాతలు ఓప్పేసుకున్నారని అంటున్నారు. మరి ఇంత ఇవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ళు పడుతుంది. అంత వరకు వేరే సినిమాలు ఒప్పుకోకుండా ముందే మాట తీసుకున్నాడు రాజమౌళి. అందుకే ప్రభాస్ ఇంత డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చేందుకు సిద్దపడ్డారని అంటున్నారు. ఆ మధ్య ప్రభాస్ నటించిన ‘మిర్చి ’సినిమా మంచి హిట్ కావడంతో కలెక్షన్ల పరంగా, ఓవర్సీస్ పరంగా భారీ రేటు పలకడంతో, ఈ సినిమాకు పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా ఓవర్సీస్ రేటు అడిగాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు ఓవర్సీస్ రైట్స్ ఇవ్వకుండా 20 కోట్లు ఇస్తున్నారట. ఏది ఏమైనా ప్రభాస్ టాలీవుడ్ లో 20 కోట్లు తీసుకుంటున్న హీరోగా రికార్డులకెక్కాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles