Varun tej launch with puri jagan

pawan kalyan, aswini dutt, naga babu, varun teja.

Nagababu son Varun Tej is going debut soon on silver screen. Puri Jagan who is driving high on success will direct Varun Tej debut movie.It has become sentiment for Mega Heroes after Allu Arjun,Charan and now Varun Tej was introducing by Aswini Dutt. The makers were yet to finalize a suitable date.

వరుణ్ తేజ్ పూరీ దర్శకత్వంలో

Posted: 05/22/2013 11:51 AM IST
Varun tej launch with puri jagan

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈయన ఎంట్రీ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘గొల్ల భామ’ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడని, శ్రీకాంత్ అడ్డాలను తప్పించి పూరీ చేతిలో వరుణ్ ని పెట్టారని అంటున్నారు. అయితే శ్రీకాంత్ ని మార్చడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు సినీ జనాలు. పూరీ జగన్నాథ్ పెద్ద ఫ్యామిలీ హీరోలను పరిచయం చేయడంలో మంచి అనుభవం ఉంది. గతంలో రామ్ చరణ్ ని ‘చిరుత ’తో లాంచ్ చేశాడు కాబట్టి ఇతన్ని కూడా పూరీకే అప్పటించారని అంటున్నారు. ఇక ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించబోతున్నారని ఇతని చేతిలో నుండి వచ్చిన చరణ్, మహేష్ వంటి వారు పెద్ద స్టార్లుగా వెలుగుతున్నారు కాబట్టి ఇతనికి ఆ ప్రాజెక్టు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా శ్రీకాంత్ ని ప్రక్కన పెట్టి వరుణ్ తేజ్ ని పూరీ చేతిలో పెట్టారని అనుకుంటున్నారు. ఇన్ని సెంటిమెంటుల మధ్య లాంఛ్ కాబోతున్న ఈ హీరో ఎంత పెద్ద స్టార్ అవుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles