Is preity zinta serious about joining politics

Preity zinta,Ishkq In Paris, preity zinta, Ishkq in Paris, Indian Premier League,Star Speak

Is Saddened by the current situation in the country, actress-businesswoman Preity Zinta is thinking about joining politics as she wants to be part of a movement to bring positive changes in India

రాజకీయాల్లోకి అందాల సుందరి ?

Posted: 05/21/2013 06:28 PM IST
Is preity zinta serious about joining politics

సినీ తారలు రంగుల ప్రపంచంలోనే కాకుండా, ప్రజాస్వామ్యంలో కూడా కీలక పాత్ర పోషించాలని, రాజకీయ నాయకులుగా/నాయకురాలిగా ఎదిగి మరింత పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తుంటారు. సినీ కెరియర్ ముగింపు దశకు వస్తుందనే క్రమంలో రాజకీయ రంగం పై కన్నేస్తారు. ఇప్పటికే పలురువు తారా మణులు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మరో అందాల సుందరి కూడా రాజకీయారంగ్రేటం చేయాలని చూస్తుంది. ఆమె ఎవరో కాదు... ప్రముఖ బాలీవుడ్ నటిగా వెలుగొందిన ప్రీతిజింటా. ఒకప్పుడు మోడల్ గా జీవితాన్ని ఆరంభించిన ప్రీతిజింటా.. మోడలింగ్ రంగంలో రాణించి తరువాత హీరోయిన్ గా... ఆ తరువాత వ్యాపారవేత్తగా  రాణిస్తుంది. ఇప్పుడు ఈమె కన్ను రాజకీయాల పై పడింది.

ఈ అమ్మడు తాజాగా తన కోరికను  యూటీవీ స్టార్స్ టెలివిజన్  ఛానల్ లో మాట్లాడుతూ బయట పెట్టింది. దేశ పరిస్థితులు తనకు ఆందోళన కలిగిస్తున్నాయని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చే విధంగా ఉద్యమంలో తాను భాగస్వామిని అవుతానని చెప్పింది. దేశంలో మార్పు తెచ్చేందుకు ఏదో ఒక రోజు రాకీయాల్లోకి వచ్చి ఓటెయ్యండని ప్రజల ముందుకు వస్తానని చెప్పింది. రాజకీయాల్లో ప్రవేశించి గ్లామరస్ పొలిటిషియన్‌గా మారుతానని, అందుకు తగిన విధంగా తనకు అందమైన జట్టు, ప్రజలను ఆకట్టుకునే విధంగా వస్త్రాలంకరణ రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తాయని ప్రీతి జింటా అంటున్నారు. అయితే రాజకీయాలంటే అందమైన జుట్టు, వస్త్రాలంకరణ, గ్లామర్ అక్కర్లేదనే ప్రాథమిక సూత్రాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాజకీయాలంటే ముఖానికి రంగేసుకున్న ఈజీ కాదని, ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న తారల పరిస్థితి గమనించిన తరువాత అడుగుపెడితే మంచిదని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles