Allu arjun nithin multistarrer

Another Multistarrer Movie with Nitin and Allu arjun by Puri Direction,Another Multistarrer Movie with Nitin and Allu arjun by Puri Direction

Another Multistarrer Movie with Nitin and Allu arjun by Puri Direction,Another Multistarrer Movie with Nitin and Allu arjun by Puri Direction

అర్జున్-పూరి-నితిన్ కాంబినేషన్

Posted: 05/16/2013 12:07 PM IST
Allu arjun nithin multistarrer

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తానేం తక్కువ తిన్నాననుకున్నాడో ఏమో కానీ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఓ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడనే వార్తలు టాలీవుడ్ లో సంచరిస్తున్నాయి. ఈయన తన తరువాతి చిత్రం యంగ్ హీరో నితిన్ తో తీయబోతున్నాడు. అయితే ఇందులో నితిన్ కాకుండా మరో హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది. ఇక రెండో హీరోగా కూడా ఓ స్టార్ హీరో నటిస్తాడని అనుకుంటున్నారు.. తాజాగా ఆ స్టార్ హీరో అల్లు అర్జున్ అని తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ, పూరి కలిసి ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ టైంలో సినిమా లైన్ బన్నీకి చెప్పగా బన్నీ ఈ సినిమా చేయడానికి ఇంటరెస్ట్ చూపించాడని చెబుతున్నారు. కాగా ఈ సినిమాను డి.యస్. రావు నిర్మిస్తారట. ఇదే కనుక నిజమైతే నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోవటం ఖాయం ఎందుకంటే..... పవన్ వీర ఫ్యాన్ గా చెలామణి అవుతున్న నితిన్ మరో మెగా హీరోతో జోడి కట్టడం అంటే సాధరణ విషయం కాదు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లవడవుతాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles