Mahesh babu new title tsunami

Mahesh Babu New Movie Title Tsunami, Mahesh Tsunami, mahesh-sukumar movie

mahesh babu new title tsunami.

మహేష్ బాబు ‘సునామీ ’ స్రుష్టించబోతున్నాడు

Posted: 05/16/2013 07:45 PM IST
Mahesh babu new title tsunami

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రానికి టైటిల్ గా చాలా పేర్లే వినబడుతున్నా, ఇంకా ఏది ఖరారు కాలేదు. తాజాగా ఈ చిత్రానికి ‘సునామీ ’ అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఆ చిత్ర దర్శకుడు ఉన్నాడని అంటున్నారు. క్రితి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా తేవాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పండుగ రోజున విడుదల అయ్యేలా చూడాలని, అప్పటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ కథకు తగ్గట్లుగా టైటిల్ ఉండాలంటే ‘సునామీ ’ కెర్టెక్ట్ అని చిత్ర యూనిట్ అంటుంటే, సినీ జనాలు మాత్రం ఈ టైటిల్ పెట్టడానికి వేరే కారణం కూడా ఉంటుందని అంటున్నారు.. రామ్ చరణ్ నటిస్తున్న హిందీ రీమేక్ చిత్రం తెలుగు వెర్షన్ కి ‘తుఫాన్ ’ టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దానికంటే పవర్ ఫుల్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ‘సునామీ ’ టైటిల్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles