Rajamouli bahubali in two parts

Rajamouli plans to Bahubali movie release in two parts,Rajamouli plans to Bahubali movie release in two parts

Rajamouli plans to Bahubali movie release in two parts,Rajamouli plans to Bahubali movie release in two parts

విశ్వరూపం తరహాలో ‘బహుబలి ’

Posted: 05/10/2013 08:42 PM IST
Rajamouli bahubali in two parts

ప్రముఖ దర్శకుడిగా పేరుతెచ్చుకొని తిరుగులేని విజయాల పరంపరను కొనసాగిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రిలోనే భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ‘బహుబలి ’ సినిమాను రూపొందించడానికి సిద్ధమై, సినిమా ప్రారంభానికి ముహూర్తం కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 14వ తారీఖున మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమా ఇంకా మొదలు కానేకాలేదు కానీ.... అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని సినిమా వర్గాల్లో టాక్. దీనికి కారణం ఏంటంటే.... రాజమౌళి రాసుకున్న కథ చాలా పెద్దదిగా ఉండటమే కారణమట. దీంతో ఈ సినిమాను రెండు పార్టులుగా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ కథను తగ్గించి తీద్దామంటే సినిమా మొత్తం దెబ్బతింటుందని ఆలోచిస్తున్నాడట. దీంతో ఈ సినిమాను ఇప్పటికే వచ్చిన రక్తచరిత్ర, కమల్ విశ్వరూపం లాగా రెండు భాగాలుగా చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో రాజమౌళి తర్జనభర్జన పడుతున్నారట. మ ఈ సినిమా ఒకే పార్ట్ ఉంటుందా ? రెండో పార్టుగా విడగొడతారనే అనే విషయం పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆ చిత్ర యూనిట్. మరి దర్శకధీరుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles