Pawan trivikram combo third film kobali

pawan trivikram third film kobali, pawan kalyan, jalsa movie, director trivikram, kobali movie

pawan trivikram combo third film kobali?

కొడుకు పేరు కోబలి

Posted: 05/05/2013 10:31 AM IST
Pawan trivikram combo third film kobali

త్రివిక్రమ్ తో పవన్ చెయ్యనున్న మూడో సినిమా టైటిల్ ఇది.  రూపుదిద్దుకుంటున్న దానికి పేరుపెట్టలేదు కానీ మరో ఆలు (హీరోయిన్) లేదు చూలు (కథ) లేదు, కొడుకు పేరు కోబలి అంటున్నారు త్రివిక్రమ్.  

మాటల మరాఠీ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా తర్వాత ఇదే కాంబినేషన్ లో మరో చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో రూపు దిద్దుకుంటోంది.  అందులో పోరాట సన్నివేశాలను అందులో సిద్ధహస్తుడైన పీటర్ హీన్స్ నిర్వహిస్తున్నారు.  ఒక రైల్వే స్టేషన్ సెట్టింగ్ లో చిత్రీకరణ జరుగుతోంది.  దానికింకా పేరు పెట్టలేదు కానీ మూడో సినిమాకి పేరు కూడా నిర్ణయించారు త్రివిక్రమ్.  దాని పేరు కోబలి.  

బలి అంటే అందరికీ తెలిసిందే.  మనిషిని కాని, జంతువుని కాని బలి ఇవ్వటం అంటే ఏమిటో అందరికీ తెలుసు.  దాన్నే రాయలసీమ ప్రాంతంలో కోబలి అనే పేరుతో వ్యవహరిస్తారట.  ఆ పేరు బాగా నచ్చిన త్రివిక్రమ్ దాని చుట్టూ కథ అల్లి అందులో పవన్ కళ్యాణ్ ని నాయుకుడిని చెయ్యటానికి చూస్తున్నానని తన సన్నిహితుల దగ్గర తన మనసులోని మాటను వెల్లడిచేసారు.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles