Mahesh babu finally in six pack

mahesh babu, prince of tollywood mahesh babu, mahesh babu six pack body,mahesh babu six pack,mahesh babu 6 pack body,mahesh babu 6 pack

mahesh babu finally in six pack

మహేష్ గుడ్ న్యూస్

Posted: 04/06/2013 08:05 PM IST
Mahesh babu finally in six pack

మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో కనిపిస్తారా ? కనిపించరా ? ఇది ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోనే హాట్ టాపిక్ ... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి కధా బలం ఉన్న , మల్టీ స్టారర్ చిత్రం లో మెరిసిన తరువాత , సుకుమార్ దర్శకత్వం లో మహేష్ తదుపరి చిత్రం ఎలా ఉంటుందో , తన ప్రతీ చిత్రం లో లాగానే , ఈ చిత్రం లో మహేష్ ఎలా వైవిధ్యంగా కనిపించబోతున్నారు, ఈ చిత్రం లో మహేష్ సిక్స్ ప్యాక్ తో దర్శనం ఇస్తారా ? వంటి ప్రశ్నలు అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ...

 

 ఇటు వంటి సమయం లో ట్విట్టర్ లో చాల రోజుల తరువాత, మహేష్ సందేశం అభిమానులని ఆనందానికి గురి చేసింది ... 'సీతమ్మ ... చిత్రాన్ని విజయవంతం చేసి నా నిర్ణయాలలో తోడుగా ఉన్న అందరికీ నా ధన్యవాదాలు ... ఇక నుండి ట్విట్టర్లో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను ... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం లో మరో వైవిధ్యమైన పాత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను ... ఈ చిత్రం లో అభిమానులు ఆశించిన విధంగానే సిక్స్ ప్యాక్ లో అందరినీ అలరిస్తాను ... ' అని వెల్లడించారు ...

14 రీల్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9 న మహేష్ జన్మదిన కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ... దేవి శ్రీ ప్రసాద్, తొలిసారిగా మహేష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ... కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది ... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles