టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగించారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ జీవితంలో గడిచినపోయిన పదేళ్ల ప్రయాణంలో .. ఎన్నో మలుపులు, మరెన్నో తీపి గుర్తులు, చేదు జ్నపకాలు జరిగాయి. కానీ పదేళ్లు జులాయిగా .. ఆడుతూ పాడుతూ గడిపినట్లుగా ఉందని అల్లు అర్జున్ చెబుతున్నారు. 2001 లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. తాతగారి అనుభవం, మామయ్య అండతో.. వెండితెరపై అడుగుపెట్టిన అల్లు అర్జున్. మెగా ఫ్యామిలికి మంచి గుర్తింపు తెచ్చాడనే చెప్పాలి. అల్లు అర్జున్ తను అస్సలు హీరో అవ్వాలనుకోలేదని కేవలం తనో పియానో టీచర్ ని కావాలనుకున్నానని బలంగా ఉండేదని చెబుతున్నారు. ‘గంగోత్రి’తో మొదలుపెట్టి... ‘జులాయి’ వరకూ అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో పదేళ్ళ ప్రస్థానం పూర్తయింది.
‘నేను పియానో టీచర్‌ని కావాలనుకునేవాడిని.. తర్వాత మార్షల్ ఆర్ట్‌స టీచర్ అవ్వాలనుకున్నాను. చివరికి యానిమేషన్ అభ్యసించి, ఇదిగో ఇలా సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకున్నాను. అయితే పదేళ్లుగా సినిమాలతో డేటింగ్ చేస్తున్నట్లుగా ఉందని జులాయి జోక్ చేశారు. డేటింగ్ అంటే సహజంగా ఒక అమ్మాయితో చేస్తారు కదా. బన్నీ మాత్రం సినిమాలతో డేటింగ్ చేసినట్లు గా ఉందని చెప్పటంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరమ్మాయిలతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. నేను జిమ్నాస్ట్‌ను కూడా అయినందువల్ల డ్యాన్స్ ఇంకా సులువు అయ్యింది. ఫైనల్ గా విజయం అనేది గమ్యమేగానీ ప్రయాణం కాదు.. నా గమ్యాన్ని ఇంకా చేరుకోవాల్సి ఉంది. మొదటి ఏడాది నుంచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమంటే ఒకటి పక్కన సున్నా చేరింది. ఈ ప్రయాణం ఒక మంచి అనుభూతినిచ్చింది.. ఎలా అన్నది వర్ణించడం కష్టంమని .. జులాయి నవ్వుతూ చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more