రియల్ స్టార్ శ్రీహరి, బ్రహ్మానందం, ఎం.ఎస్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో రుషీల్ మూవీస్ పతాకంపై సి.ఎస్.ఆర్.కృష్ణన్ దర్శకత్వంలో అప్పల కోటేశ్వరరావు, శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘బకరా’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది.
దర్శకుడు సి.ఎస్.ఆర్.కృష్ణన్ మాట్లాడుతూ- టైటిల్‌తోపాటు చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ‘బకరా’ టైటిల్ సాంగ్, గ్రాఫిక్స్ తో సినిమా పూర్తయ్యింది. ఫస్ట్ కాపీ సిద్ధమైన ఈ చిత్రం సెన్సార్ పనుల్లో ఉంది. వినోదానికి పెద్ద పీట వేస్తూ పరిశ్రమలోని ప్రముఖ కమెడియన్స్ అందరూ ఇందులో నటించారు. మాఫియా డాన్‌గా శ్రీహరి నటన ‘బకరా’కి హైలెట్‌గా నిలుస్తుంది. ఆడియో విషయానికొస్తే ‘టైటిల్‌సాంగ్ సూపర్‌హిట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ నెల 3వవారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ మూవీలో డా.శ్రీహరి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, అలీ, తనికెళ్ళ భరణి, ధర్మవరపు, కొండవలస, రాళ్లపల్లి, దువ్వాసి, కృతిక, షాని నాయుడు, ప్రదీప్, నవీన్, పవన్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సి.ఎస్.కృష్ణన్, సంగీతం: రోషిత్ ఆర్.కె., కెమెరా: విజయశ్రీ, నిర్మాతలు: సిహెచ్.శివరామకృష్ణ, అప్పల కోటేశ్వరరావు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more