Ravi teja movie updates

hero ravi teja, ravi teja balupu movie, ravi teja movie updates, ravi teja movie news, sarochharu, sarocharu movie, shock movie, veera movie, balupu first look, raviteja wallpapers

ravi teja movie updates

33.gif

Posted: 01/28/2013 11:19 AM IST
Ravi teja movie updates

balupu

       మాస్ మహరాజా బిరుదు వరించింది మొదలు వరుస పరాజయాలు రవితేజ కెరీర్ ను వెనక్కులాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పునరాలోచనలోపడ్డ రవి తన గురించి బాగా తెలిసిన దర్శకులే తనకు విజయాన్ని ఇవ్వగలరని గట్టిగా విశ్వసిస్తున్నాడు. అందుకే, గతంలో తనకు ప్లాపు ఇచ్చిన దర్శకుడితోనే మళ్లీ ఓ  సినిమా చేసేందుకు  అంగీకరించాడు.
      దర్శకుడు రమేష్ వర్మ గతంలో రవితేజతో  'వీర' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ  చిత్రం రవితేజకు సక్సెస్ కట్టబెట్టలేదు. అయినా,  మళ్ళీ ఆ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో, సినిమా చేయటానికి రవితేజ సరేనన్నాడని తెలుస్తోంది.
    ఇదే తరహాలో రవికి అంతకు ముందు  'షాక్ ' ఇచ్చి నిరాశపరిచిన హరీష్ శంకర్ తిరిగి రవితేజతోనే సినిమా చేసి 'మిరపకాయ్' వంటి సూపర్ హిట్ ను అందించటం ఇక్కడ గమనార్హం.
     కాగా,  ప్రస్తుతం రవి చేస్తున్న 'బలుపు' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. బలుపు  పూర్తవగానే రమేష్ వర్మ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naga chaitanya signs another movie
Shekar kammula kahani remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles