Shekar kammula kahani remake

shekar kammula, kahani remake, vidyabalan, kahani movie, life is beautiful movie, happydays, shekar kammula movies,

shekar kammula kahani remake

27.gif

Posted: 01/28/2013 11:05 AM IST
Shekar kammula kahani remake

 s

       ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' అంతందంగా లేకపోవటంతో పద్దతైన డైరెక్టర్ తన పద్దతి మార్చుకున్నాడు. ఇంతవరకూ ఏడాదికో, రెండేళ్ళకో ఓ సినిమా చేస్తున్న శేఖర్‌ కమ్ముల ఇక నుంచి త్వరితగతిన సినిమాలు పూర్తి చేయలనే డిసైడయ్యాడు. ఆ మధ్య శేఖర్ దర్శకత్వం వహించిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రం 'హ్యాపీడేస్‌' లాగానే ఉందనే విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తన తదుపరి చిత్రాన్ని వినూత్నంగా, విభిన్న కథ కథనంతో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
      ఇందులో భాగంగా శేఖర్ చూపు బాలీవుడ్‌ 'కహాని'పై పడింది. విద్యాబాలన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. 10 కోట్లతో తీసిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్ళ వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా హక్కులు పంది రీమేక్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.
      ఇంతకీ ఈ చిత్ర కథాంశం ఏంటంటే.. భర్త ఆచూకీ కోసం మహానగరంలో అడుగుపెట్టిన నిండుగర్భిని అగచాట్లే ఈ మూవీ ఇందులో విద్యా తన నటనతో విమర్శకులను సైతం మెప్పిస్తే, ఇప్పుడు ఆ పాత్రలో నయనతార కన్పించబోతోంది.
       మళ్లీ ఈ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. ప్రధాన కథాంశం మాత్రమే తీసుకుని కథనాన్ని తనదైన రీతిన నడిపించేందుకు కమ్ముల స్క్రిప్ట్ సిద్ధంచేసుకున్నాడు. మార్చిలో షూటింగ్‌ మొదలుకాబోతుంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja movie updates
Mahesh babu with bollywood heroines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles