Director vv vinayak interview

director vv vinayak, vv vinayak interview, vv vinayak movies, vv vinayak pawan kalyan, vv vinayak charan, vv vinayak jr.ntr, vv vinayak allu arjun, lakshmi movie, aadi movie, nayak, naayak, badrinadh,

director vv vinayak interview

1.gif

Posted: 01/19/2013 11:10 AM IST
Director vv vinayak interview

        14చిన్న హీరో అని లేదు, బడా హీరో అని లేదు ఎవరినైనా డైరెక్ట్ చేసి శహబాష్ అనిపించుకోగల సత్తా ఉన్న డైరెక్టర్ వివి వినాయక్. జు.ఎన్టీఆర్ తో 'ఆది' చిత్రం నుంచి 'బద్రినాథ్‌' వరకు ప్రతి చిత్రం యాక్షన్‌, ఫ్యాక్షన్‌ చిత్రాలే తీశారు.  అనంతరం ఒక్కసారిగా ట్రాక్‌ మార్చి కామెడీలోకి వచ్చారు. రామ్‌చరణ్‌తో 'నాయక్‌' తీసి బాక్సాఫీస్ కొల్లగొడుతున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో సహా మోగల్లు,  పాలకొల్లు, జిన్నూరు సందర్శించారు. ఇందులో భాగంగా జిన్నూరు జడ్‌పి హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఎన్నో విషయాల్లో వివరణ ఇచ్చారు.
          'కృష్ణ'  చిత్రం నుంచి మీ ట్రెండ్‌ మారినట్లుందని అడిగితే వినాయక్ ఇలా అంటున్నారు.. 'ఆది' నుంచి 'సింహాద్రి' వరకు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ను అందరూ ఆదరించారు. నా స్నేహితులు కూడా బాగానేఉంది కానీ... యాక్షన్‌ తగ్గించమని సూచనలు చేశారు. 'బన్ని'లో కామెడీ టచ్‌ చేశాక బాగుందనిపించింది. ఇప్పుడు పిల్లలు టామ్‌జర్రీ లాంటి కార్టూన్‌ నెట్‌వర్క్‌ కు ఎక్కువగా ఎడిక్ట్‌ అయ్యారంటే.. అది వారినెంతగానో ఆకట్టుకుటుంది. ఒక రకంగా వారి మానసిక ఆరోగ్యానికి ముఖ్యం కూడా. అందుకే పిల్లలు కూడా ఇష్టపడాలని ఆవైపు మళ్ళాను. ప్రేక్షకులు కూడా వచ్చిన కథలే మళ్ళీ వస్తున్నాయని విమర్శిస్తున్నారు కూడా, అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌ చూపించాను. బద్రినాథ్‌ చూశాక చాలామంది సీరియస్‌ సబ్జెక్ట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదన్నారు. ఆ విషయంలో మిస్‌ అయింది, నాయక్‌లో పెట్టి అందరినీ ఆకర్షించే మార్పు గమనించాను. చిరంజీవితోనే ఖైదీ రీమేక్‌ అనుకున్నాం. కానీ ఆయన పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సాధ్యపడదని తర్వాత తెలిసింది. చేస్తే రామ్‌ చరణ్‌తోనే చేయాలి, దానికోసం కథను కూడా కొద్దిగా మార్చాలి. ఇక నాయక్ మూవీలో గండిబాబ్జీ పాత్రగురించి చెబుతూ గండి బాబ్జీ ఒక రాజకీయ నాయకుడు. కానీ ఆయనుద్దేశించి విలన్‌కు పేరు పెట్టలేదు. ఈ విషయమై గతంలో కూడా వివరణ ఇచ్చాను. ఆయన మనస్థాపానికి గురైతే క్షమించమని కోరాను. గతంలో వారం రోజుల్లో ఆ పేరును తీసేస్తామని చెప్పాను.

vvvvv
            నాయక్ లో చాలా సినిమాలు మిక్స్ అయ్యేయనేదానికి వివరణ ఇస్తూ..  గతంలో హిట్‌ అయిన పెద్ద సినిమాలు కూడా.. సమరసింహా రెడ్డి, బాషాలా ఉన్నాయని చాలాకామెంట్లు వచ్చాయి. ఇదేకాదు బాలీవుడ్‌ చిత్రాలుకూడా కాపీలనే కంప్లెంయిట్లు ఉన్నాయి. ఆ సినిమా కాపీనా, ఈ సినిమా కాపీనా అని కాకుండా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే సినిమా పని. ఈ చిత్రంపై కాంట్రవర్సీ ఉంది వాస్తవమే. కానీ చెడ్డ సినిమా కాదు. ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా వచ్చాయి.  మెగా ఫ్యామిలో పవన్‌ మిగిలారు, ఆయనతో సినిమా ఉందా అని అడిగితే.. పవన్‌తో చేయాలని ఇంతకుముందే అనుకున్నాం. కానీ కుదరలేదు. తప్పకుండా సరైన కథ దొరికితే చేస్తాను. ఇది త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బెల్లంకొండ సురేష్‌ అబ్బాయి సాయిగణేష్‌తో సినిమా ఉంది. ప్రేమకథతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా అనుకుంటున్నాం. అని ఎంతో వినమ్రంగా సామాధానమిచ్చారు వివి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu repetes dookudu combination
Charan dance in nayak success tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles