Rajani kanth enter into politics

rajani kanth, kamal hassan, rajani kanth politics, rajani kanth enter into politics, rajani kanth tamilnadu, rajani kanth movies, rajani kanth latest pics, rajani kanth movie news, karunanidhi, chidambaram, kamal hassan karunanidhi

rajani kanth enter into politics..?

8.gif

Posted: 12/30/2012 04:40 PM IST
Rajani kanth enter into politics

raj_in

         ఎప్పుడూ నర్మగర్భంగా మాట్లాడే ప్రముఖ నటుడు కమల్ హాసన్ వింతైన వ్యాఖ్య చేసారు. పంచె కట్టిన తమిళుడే భవిష్యత్తులో ప్రధాని పదవి చేపట్టాలని కమల్‌ ఆకాంక్షించారు. చిదంబరం రాజకీయ జీవితం, ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటి వెనుక నెలకొన్న సమస్యలు, ప్రముఖులు ఆయనకు రాసిన లేఖలతో 'పి.చిదంబరం ఒక పారై' పేరుతో రచయిత నటరాజన్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
        ఈ పుస్తకాన్ని డీఎంకే అధినేత కరుణానిధి ఆవిష్కరించగా, తొలిప్రతిని చిదంబరం మాతృమూర్తి లక్ష్మీ అచ్చి అందుకున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో చిదంబరం కూడా ప్రధాని పదవి చేపట్టాలని అభిలషించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కరుణానిధి మాట్లాడుతూ.. పంచె కట్టిన తమిళుడే ప్రధాని కావాలన్న కమల్ వ్యాఖ్యలతో తానూ ఏకీభవిస్తున్నానని తెలిపారు.
        కాగా, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. చాలామంది అభిమానులు తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వస్తే సాదాసీదాగా ఉండదని, అది 'ప్రత్యేకదారి'గానే ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం పేదవారిని ధనికుల్ని చేయగలరని, అదే విధంగా ధనికుల్ని ఎక్కువ ధనవంతులు కాకుండా కూడా చూడగలరని రజనీ పేర్కొన్నారు. తాజా రజనీ వ్యాఖ్యలతో తమిళనాడులో విస్త్రుత చర్చకు తెరలేచింది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chammak challo movie updates
Ramcharan nayak and yevadu movie news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles