Ramcharan nayak movie title controversy

Naayak Title In Controversy. naayak title controversy ,nayak title landed in controversies , nayak film title controversy. Naayak telugu movie title

Ramcharan nayak movie title controversy

Ramcharan nayak movie title controversy.png

Posted: 12/25/2012 06:33 PM IST
Ramcharan nayak movie title controversy

Ramcharan_nayak_movie_title

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సినిమా టైటిళ్ళ వివాదం తరుచూ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో సినిమా టైటిళ్ళ వివాదాలు తారా స్థాయికి కూడా చేరాయి. చివరికి  సినిమా టైటిళ్ళు మార్చి విడుదల చేసిన సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా రామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య రాబోతున్న ‘నాయక్ ’ సినిమా పై కూడా వివాదం చెల రేగుతుంది. ‘నాయక్ ‘ అనే సినిమా టైటిల్ ని మార్చాలంటూ గిరిజన విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన విద్యార్ధి సంఘాల నాయకులు మాట్లాడుతూ.... 'నాయక్' అనే పదం గిరిజన తెగకి చెందిన లంబాడీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అనీ, అది తమ ఆత్మ గౌరవానికి సంబంధించినదని, ఈ పేరుతో సినిమా విడుదల చేస్తే మాకు అవమానం జరిగినట్లేనని, వెంటనే ఈ సినిమా పేరును మార్చాలని అన్నారు. లేకుంటే ఆందోళనలు చేయడానికైనా వెనకాడం అంటున్నారు. గతంలో పవన్ కళ్యాన్ సినిమా ‘కొమురం పులి ’ పై రాద్దాంతం  చేసి చివరికి ‘పులి ’గా విడుదల చేయించారు. 

అయితే నాయక్ సినిమా యూనిట్ వారు మాత్రం ఇలాంటి చిన్న చిన్న అంశాలను తెర పైకి తెచ్చి, డబ్బులు వసూలు చేయడానికే ఇలా చేస్తున్నారని, ఇన్ని రోజులు లేని అభ్యంతరం విడుదలకు ముందు ఎందుకు వచ్చిందని దీని వెనుక ఎవరో ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. మరి ‘నాయక్ ’ని అదే పేరుతో విడుల చేస్తారో లేక మార్చి విడుదల చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nose injury for ram charan nayak shooting
Ntrsantosh srinivas movie title rabasa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles