Ramcharan nayak story line

ramcharan, ramcharan nayak story line, ramcharan kajal, ramcharan wallpapers, ramcharan nayak stills, ramcharan teaser, ramcharan working stills, ramcharan nayak updates, nayak videos

ramcharan nayak story line

21.gif

Posted: 12/14/2012 07:10 PM IST
Ramcharan nayak story line

raa

       మెగాఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న నాయక్ చిత్ర కథాంశం గురించి చిత్ర యూనిట్ ఎలాంటి హింటూ ఇవ్వటంలేదు. అయితే తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ ఇలా ఉండబోతుందని తెలుస్తుంది.  ఈ ప్రపంచంలో ఆధిపత్యం చలాయించేవారు చాలా మంది ఉంటారు. వారెవరూ నిజమైన నాయకులు కారు. నిజమైన నాయకుడు జనం నుంచే పుడతాడు. జనం కోసమే బతుకుతాడు. అదే ఈ సినిమాలో చరణ్. రామ్‌చరణ్‌ని ఆయుధంగా చేసుకొని యువశక్తి తఢాకాను చూపించబోతున్నారు దర్శకుడు వీవీ.
       చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాత డీవీవి దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.  తమన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 17న అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నామని దానయ్య తెలిపారు.
     ఇంకా, ఇది నిర్మాతగా నాకే కాదు... లక్షలాది మెగా అభిమానులకు కూడా ప్రత్యేకమైన సినిమా. ఇందులో కొత్త చరణ్‌ని చూస్తారు. మెగాస్టార్‌ని తలపించేలా ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది. కాజల్, అమలాపాల్ అందచందాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి అని వెల్లడించారు.
          ప్రముఖ నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు. ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌సాయి. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharwanand nitya menon movie news
Hrithik roshan sexiest man in asia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles