D for dopidi movie logo launch

d for dopidi movie, d for dopidi logo launch, d for dopidi wallpapers, dfor dopidi logo, varun sandesh movie, producer aswini dutt, director krish, dfor dopidi casting,

d for dopidi movie logo launch

23.gif

Posted: 12/05/2012 03:25 PM IST
D for dopidi movie logo launch

d-for-dopidi-movie_inn        నలుగురు భావిభారత పౌరులు దోపిడీదారులుగా మారితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ తో 'డి ఫర్‌ దోపిడి' చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్‌లో 'షోర్‌ ఇన్‌ దసిటీ', 99, ఫ్లేవర్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రవాసాంధ్రులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకెలు తొలి ప్రయత్నంగా డి2ఆర్‌ ఫిలింస్‌ బేనర్‌పై చిత్రాన్ని నిర్మించారు. 'షోర్‌ ఇన్‌ దసిటీ' కి అసిస్టెంట్‌గా పనిచేసిన సిరజ్‌ కల్లా ఈ చిత్రానికి దర్శకుడు.
          వరుణ్‌సందేశ్‌, సందీప్‌ కిషన్‌, నవీన్‌, రాజేష్‌ దోపిడీ దొంగలుగా నటించిన ఈ చిత్ర లోగోను ప్రసాద్‌ల్యాబ్స్‌ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంలో అశ్వనిదత్ మాట్లాడుతూ.. 'ఎవరైనా ఇంటగెలిచి రచ్చ గెలుస్తారు. ఈ చిత్ర నిర్మాతలు మొదట బాలీవుడ్‌లో సినిమా తీసి రచ్చ గెలిచారు. ఇప్పుడు ఇంట గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో నేను కూడా వీరితో వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై సినిమా చేయనున్నా'నని వెల్లడించారు.

d-dopidi-wallpapers-1        దర్శకులు సుకుమార్‌, క్రిష్‌లు మాట్లాడుతూ..తపనతో చిత్రాలు తీసే ఇటువంటి నిర్మాతలు సినీ పరిశ్రమకు చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ చిత్రంద్వారా నటుడైన దేవకట్టా మాట్లాడుతూ.. 'ఇందులో ఎ.సి.పి. కృష్ణమాచారి పాత్ర పోషించాను. ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక కథ. నటుడిగా మంచి పేరువస్తుందనే నమ్మకముంది' అని అన్నారు. చిత్ర దర్శకుడు సిరాజ్‌ కల్లా తెలుపుతూ..'కథను నమ్మి దర్శకుడిగా అవకాశం కల్పించారు. మంచి చిత్రం తీశాననే నమ్మకముంది. త్వరలో విడుదల చేయనున్నా'మని తెలిపారు. వరుణ్‌సందేశ్‌ మాట్లాడుతూ కథ కొత్తగా ఉందనీ, కెరియర్‌కు ఉపయోగ పడే చిత్రమవుతుందనీ అన్నారు.
         సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ 'ప్రస్థానం సినిమా చూశాక రాజ్‌, డీకెలె 'షోర్‌ ఇన్‌ ది సిటీ'లో అవకాశం కల్పించారు. మళ్ళీ ఈ చిత్రంలో అవకాశం కల్పించారు. నలభైమంది నటీనటులతో చాలా ఫన్నీగా సాగుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది' అని అన్నారు. కాగా, ఈ చిత్ర కాప్షన్‌ 'దొబ్బడానికా? దొబ్బించు కోడానికా?' అని ఖరారు చేశారు. దీనిపై కొందరు విలేకరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే కాప్షన్‌ తీసేస్తామని నిర్మాతలు తెలపటం కొసమెరుపు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Regina to pair up with jr ntr
Svsc audio function in ramanaidu studios  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles