Amitab birthday story

amitab birthday story

amitab birthday story

21.png

Posted: 10/11/2012 04:07 PM IST
Amitab birthday story

amitab_inneree

1942 అక్టోబర్ 11 న అలహాబాద్ లోని హరివంశరాయ్ బచ్చన్ - తేజీ బచ్చన్ దంపతుల తొలి సంతానంగా అమితాబ్ జన్మించారు. తండ్రి హరివంశరాయ్ ప్రముఖ కవి ... ఆయన కలం పేరే బచ్చన్. ఆ పేరుతోనే ఆయన పాప్యులర్ కావడంతో, అమితాబ్ కూడా బచ్చన్ పేరుతోనే వెండితెరకి పరిచయమయ్యారు. వెనుతిరిగి చూడని కెరియర్ ను వశం చేసుకున్నారు. బాల్యం నుంచే నటన పట్ల మక్కువ పెంచుకున్న అమితాబ్, ఆ దిశగా అడుగులువేసే క్రమంలో ఎన్నో అవమానాలను ... అవాంతరాలను ఎదుర్కున్నారు. వాటిని పాఠాలుగా స్వీకరించారు ... అభివృద్ధికి సోపానాలుగా మలచుకున్నారు. 1969 లో 'సాత్ హిందూస్థాని' చిత్రం ద్వారా ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ సాధించకపోయినప్పటికీ, అమితాబ్ కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత 'ఆనంద్' ... 'పర్వానా' ... 'బొంబై టూ గోవా' వంటి చిత్రాల లో నటించినప్పటికీ, 1973 లో వచ్చిన 'జంజీర్' అఖండ విజయాన్ని అందించింది ... దాదాపు దశాబ్దానికి సరిపడ కెరియరును కానుకగా ఇచ్చింది. అమితాబ్ లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించిన ఈ చిత్రం యాంగ్రీ యంగ్ మేన్ గా ఆయనకి పట్టం కట్టింది. ఆ తరువాత వచ్చిన 'చుప్కే చుప్కే' ... 'ఫరార్' ... 'మిలీ' వంటి సినిమాలు అసమానమైన ఆయన నటనకు ఆనవాళ్ళుగా నిలిచాయి ... అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించి పెట్టాయి.
        ఇక 'దివార్' ... 'షోలే' వంటి చిత్రాలు బాక్సాఫీసు రికార్డులను తిరగరాశాయి ... అమితాబ్ కి స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. ఆరంభం నుంచి కూడా మల్టీ స్టారర్ చిత్రాల పట్ల అమితాబ్ ఆసక్తిని చూపించారు. ఈ కారణంగానే 'త్రిశూల్' ... ముఖద్దర్ కా సికిందర్' ... 'మిస్టర్ నట్వర్ లాల్' ... 'దోస్తానా' ... 'లావారీస్' ... శక్తి' వంటి చిత్రాలు ఆయన కెరియర్లో మైలురాళ్లుగా ... ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిలా కనిపిస్తాయి. 1982 లో 'కూలీ' చిత్రం షూటింగులో గాయపడిన అమితాబ్, కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. ఆ తరువాత ఆయన 1988 లో 'షహన్ షా' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి, వాళ్లతో కేరింతలు కొట్టించాడు. 1996 లో ఆయన స్థాపించిన ఏ.బి.సి.ఎల్. కంపెనీ దెబ్బతినడంతో, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అప్పుడే డబ్బు కోసం ఆయన టెలివిజన్ రంగం వైపు తన దృష్టిని సారించారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' ప్రెజెంటర్ గా అశేష్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత 'ఆగ్' ... సర్కార్ రాజ్' ...  'పా' వంటి చిత్రాలు ఆయన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాయి. ఇవాళ ఆ మహోన్నత వ్యక్తి బర్త్డే సందర్భంగా తెలుగువిశేష్.కాం శుభాకాంక్షలు అందిస్తోంది.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Posani as tippu sultan
Tamanna rules out in himmatwala movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles