Orange movie in tamil title ramcharan

orange movie in tamil title ramcharan , maveeran, cirutaipuli, ragalai

orange movie in tamil title ramcharan

17.png

Posted: 10/07/2012 05:15 PM IST
Orange movie in tamil title ramcharan

ram_charan_innere

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జెనిలియా ప్రధాన పాత్రలలో 2010లో వచ్చిన “ఆరెంజ్” చిత్రం తాజాగా తమిళంలో అనువదించబడుతుంది. విశేష మేమిటంటే.. ఈ తమిళ అనువాద చిత్రానికి “రామ్ చరణ్” అనే పేరు పెట్టారు. “మగధీర” చిత్ర విజయం సాధించాక తమిళంలో రామ్ చరణ్ సినిమాలు బాగా అనువాదమవుతున్నాయి. మొదట “మగధీర” చిత్రాన్ని “మావీరన్” అనే పేరుతో విడుదల చేసారు. తరువాత “రచ్చ” చిత్రాన్ని “రగలై” అనే పేరుతో విడుదల చేశారు. ఈ మధ్యనే “చిరుత” చిత్రాన్ని “సిరుతై పులి” అనే పేరుతో అనువదించారు. తాజాగా “ఆరెంజ్” చిత్రాన్ని అనువదిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాలా భాగం ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. చిత్రం విజయం సాధించకపోయినా హారిస్ జయరాజ్ అందించిన సంగీతం మరియు బి రాజశేఖర్,కిరణ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.
    ఇదిలా ఉండగా,  రామ్ చరణ్ తొలిసారిగా నటిస్తున్న హిందీ సినిమా 'జంజీర్' కోసం ఓ ఐటెం సాంగును అదిరిపోయే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారట. మామూలుగా ఇలాంటి ఐటెం పాటలను ప్రత్యేకంగా ఐటెం గాళ్స్ చేత చేయిస్తుంటారు. కానీ, ఈ సినిమా విశేషం ఏమిటంటే, ఇందులో కథానాయికగా నటిస్తున్న ప్రియాంకా చోప్రానే ఈ ఐటెం నెంబర్ కి డ్యాన్స్ చేయనుంది. ఈ విషయాన్ని ప్రియాంకా చాలా గర్వంగా చెప్పుకుంటోంది. 'నా సినిమాలో నేను ఐటెం నెంబర్ చేస్తున్నాను. నిజంగా ఇది నాకొక థ్రిల్. ఇది ఫుల్ మాస్ డ్యాన్స్ తో కూడిన పాట' అంటోంది ప్రియాంకా. ఇక ఆమెతో జతకట్టే రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి, ఈ ఐటెం సాంగ్ కెవ్వు కేకే....

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi manchu birthday teluguwishesh
Manchu vishnu denikainaready music review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles