Lakshmi manchu birthday teluguwishesh

lakshmi manchu birthday teluguwishesh, tollywood actor mohan babu daughter

lakshmi manchu birthday teluguwishesh

13.png

Posted: 10/08/2012 05:44 PM IST
Lakshmi manchu birthday teluguwishesh

Lakshmi_Manchu_inn      

సామాజిక పరిభాషలో చెప్పాలంటే ప్రస్తుతం తరుణంలో మహిళా సాధికారతకు ప్రతిరూపం ఈమె. ఆమె మరెవరో కాదు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కుమార్తె. లక్ష్మీ మంచు... సెలెబ్రెటీ కూతురి హోదాలో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ.. ఆ తర్వాత వైధ్యమైన కార్యక్రమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం లక్ష్మీ మంచు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నటిగా, టీవీ వ్యాఖ్యాతగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డా. మోహన్ బాబు, శ్రీమతి విద్యాదేవిలకు 1976 అక్టోబర్ 8న లక్ష్మీ మంచు జన్మించారు. ఆమెకు ఆండీ శ్రీనివాసన్ తోవివాహం చేసారు.

lakshmi

ఇండియాలో ఆమె చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఓక్లహోమ సిటీ యూనివర్సిటీ లో థియేటర్ గురించి నేర్చుకోవడానికి యు.ఎస్ వెళ్ళారు. ‘లాస్ వెగాస్’, ‘డెస్పరేట్ హౌస్ వైఫ్స్’ అనే పాపులర్ అమెరికన్ టీవీ షోలలో కూడా కనిపించారు. ఆ తర్వాత ఇండియా వచ్చి ఇక్కడ చేసిన ‘లక్ష్మీ టాక్ షో’ అనే ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. లక్ష్మీ మొదటి సారిగా ‘అనగనగా ఓ ధీరుడు’ నటించిన ఐరెంద్రి పాత్రకి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం లక్ష్మీ మంచు నటించిన చిత్రాలు ఈ సంవత్సరం వరుసగా విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో మొదటిది తనే నటిగా మరియు నిర్మాతగా తీసిన ‘గుండెల్లో గోదారి’. 1986లో జరిగిన గోదావరి వరదలని నేపధ్యంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండవది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న’కాదల్’.ఇలాగే మరిన్ని శిఖరాలు లక్ష్మీ అందుకోవాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది తెలుగువిశేష్.కాం..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramgopal varma sirasri book
Orange movie in tamil title ramcharan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles