Remake of sudigadu by ram gopal varma

ramgopal varma director, tollywood hit movie sudigadu, sudigadu remake in bollywood, producer sureshbabu,

remake of Sudigadu by Ram Gopal Varma

Sudigadu.gif

Posted: 09/26/2012 12:26 PM IST
Remake of sudigadu by ram gopal varma

Ritesh Deshmukh okayed Sudigadu remake

సుడిగాడు’ చిత్రం విడుదలై మంచి కలెక్షన్స్ సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. తెలుగు నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని హిందీ రైట్స్ తీసుకున్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మతో కలిసి నిర్మిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ బ్రాండ్ ఇమేజ్ ఈ చిత్రం హిందీ మార్కెట్ కి ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.హిందీ వెర్షన్ కు గానూ రితీష్ దేశ్ ముఖ్ హీరోగా చేస్తున్నారు. ఆయన ఈ చిత్రం చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రితీష్ ..వర్మ దర్శకత్వంలో చిత్రాలు చేసి ఉన్నారు. దాంతో ఆయన వర్మ చెప్పగానే ఈ చిత్రం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందీ వెర్షన్ కి సరిపడేలా స్క్రిప్టు వ్రాస్తున్నారు. పాత,కొత్త సూపర్ హిట్ హిందీ చిత్రాలను స్పూఫ్ చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. తెలుగు,తమిళ మాదిరిగానే హిందీలోనూ ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అతి చిన్న బడ్జెట్ లో అతి పెద్ద విజయం ఈ చిత్రం ద్వారా సాధించవచ్చని సురేష్ బాబు నిర్ణయించుకునే ఈ రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

remake of Sudigadu by Ram Gopal Varma

సుడిగాడు’ రిలీజయ్యాక ఆ సినిమా హిందీ, కన్నడ రీమేక్ హక్కులు అడుగుతున్నారని ఆయన చెప్పారు.మా సినిమాను చిన్న సినిమాల్లో ‘గబ్బర్‌సింగ్’, ‘దూకుడు’ అంటున్నారు” అని ఆనందంగా చెప్పారు అల్లరి నరేష్. తమిళ చిత్రం ‘తమిళ్ పడమ్’ ఆధారంగా అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన ‘సుడిగాడు’ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఖర్చు పెట్టిన దానికి తగ్గట్లే బిజినెస్ జరగడం, కలెక్షన్లు రావడం, ఈ సినిమాని కొనుక్కున్న వాళ్లంతా సంతోషంగా ఉండటం చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం భీమనేనిగారు చాలా కష్టపడ్డారు. స్పూఫింగ్ (పేరడీ) కోసం వంద సినిమాల్ని ఎంపిక చేసుకోవడం, వాటిలోంచి ఈ సినిమాకి పనికివచ్చే అంశాల్ని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana barfi movie success
Rana krish nayanatara movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles