Rana krish nayanatara movie

rana-krish-nayanatara-movie,

rana-krish-nayanatara-movie

rananayana.gif

Posted: 09/24/2012 09:14 PM IST
Rana krish nayanatara movie

rana_inne

దగ్గుబాటి రానా, నయనతారల హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం”. ఈ చిత్రం తాజా ప్రోగ్రెస్ రిపోర్టు ప్రకారం ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే “రంగ మార్తాండ బి.టెక్ బాబు” అనే పాటను రానా,రఘు బాబు మరియు ఇతర నటుల మీద చిత్రీకరించిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో గాయాల పాలయ్యారు. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ కానుంది. క్రిష్ మొదటి సారిగా పూర్తి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిబాబా జాగర్లమూడి మరియు వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా వి ఎస్ జ్ఞాన శేకర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలున్నాయి. “నా ఇష్టం” చిత్రం తర్వాత రానా చేస్తున్న చిత్రం ఇదే కావటం విశేషమైతే, నయనతార “శ్రీ రామ రాజం” చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ఇది కావటం మరోవిశేషం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Remake of sudigadu by ram gopal varma
Amir khan stamina talaash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles