Nitin movie gundejari gallantayyindi

nitin-movie-gundejari-gallantayyindi

nitin-movie-gundejari-gallantayyindi

17.gif

Posted: 09/18/2012 06:58 PM IST
Nitin movie gundejari gallantayyindi

gundejari-gallntuee     నితిన్ - నిత్యామీనన్ జంటగా రూపొందనున్న తాజా చిత్రానికి ఇవాళే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీకి 'గుండెజారి గల్లంతయ్యిందే' అనే పేరును నిర్ణయించారు. ఇటీవల సంచలన విజయాన్ని సాధించిన 'గబ్బర్ సింగ్' చిత్రంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' అనే పాట బాగా పాప్యులర్ అయింది. దాంతో యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టినట్టు చెబుతున్నారు. ఇక నితిన్ ... పవన్ కి వీరాభిమాని కాబట్టి ఈ టైటిల్ ను అతనే సూచించి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. ఇటీవల నితిన్ - నిత్యా మీనన్ జంటగా గతంలో వచ్చిన 'ఇష్క్' చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇటు నితిన్ కి ... అటు నిత్యా మీనన్ కి కెరియర్ పరంగా మంచి ఊతాన్ని ఇచ్చింది. ఈ సినిమా లాభాల పంట పండించడంతో, ఇదే సంస్థ ఇదే జంటతో ఈ సినిమా తీయడానికి రంగాన్ని సిద్ధం చేసింది. ఈ సినిమా షూటింగ్ 'వినాయక చవితి' సందర్భంగా రేపు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nitya menon cine entry
Devi sriprasad orchestra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles