Sahasra movie krishnudu shafi

sahasra-movie-krishnudu-shafi, rajiv kanakala,

sahasra-movie-krishnudu-shafi

7.gif

Posted: 09/18/2012 01:26 PM IST
Sahasra movie krishnudu shafi

Sahasra-Movie-inneeee        కృష్ణుడు, షఫి, రాజీవ్‌కనకాల, రవిప్రకాష్‌ తారాగణంలో రూపొందుతున్న చిత్రం 'సహస్ర'. శ్రీశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. పి.ఎల్‌.ఎన్‌.రాజు నిర్మాత. శ్రీవిశాల్‌ కందుకూరి దర్శకుడు. ఈ చిత్రం నిన్నటితో తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. మలి షెడ్యూల్‌ ఈనెల 29 నుంచి జరగనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పి.ఎల్‌.ఎన్‌.రాజు మూవీ అప్డేట్స్ వెల్లడించారు.
         'రాజాం పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ పూర్తిచేశాం. 29నుంచి సెకండ్‌ షెడ్యూల్‌ రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. అనంతరం అవుట్‌డోర్‌లో 15 రోజులపాటు కీలక సన్నివేశాలను చిత్రించనున్నాం. నవంబర్‌లో ఫైనల్‌ షెడ్యూల్‌ జరపున్నా'మని తెలిపారు. దర్శకుడు విశాల్‌ కందుకూరి తెలుపుతూ..'సహస్ర అనేది అమ్మాయి పేరు. ఆమె చుట్టూ తిరిగే కథ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉంది. రామోజీ ఫిలింసిటీలో ఫ్యాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, కైమాక్స్‌ చిత్రించనున్నాం. మొదటి షెడ్యూల్లో ఓ పాట, కొంత టాకీ పార్ట్‌ పూర్తయింది. సంగీతపరంగా గీతాపూనిక్‌ చక్కటి బాణీలు సమకూర్చారు. ఐదు పాటలున్నాయి. రాజీవ్‌కనకాల జమీందార్‌ పాత్ర పోషిస్తున్నారు. శ్రీఐర తమిళంలో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో మొదటిసారిగా నటిస్తోంది. మెడిసిన్‌ చదివే పాత్రను ఆమె పోషిస్తోంది. షఫీ పాత్ర కీలకం. విలన్‌గా వైవిద్యంగా కన్పిస్తారు. కథమొత్తం చెప్పాలంటే ఒక్కటిక్కెట్‌పై రెండు సినిమాలు చూస్తున్నట్లుగా ఉంటుంది' అని అన్నారు.sahasra_movie_launceeee       సంగీత దర్శకుడు గీతాపూనిక్‌ మాట్లాడుతూ, 'పాటలుకూడా నేనే రాశాను. గతంలో మణిశర్మ, శ్రీలేఖ వంటి ప్రముఖుల గేయ రచయిత దగ్గర పనిచేశాను. గీత రచయితగా 'ఆల్‌ది బెస్ట్‌'కు పనిచేశాను. సంగీత దర్శకుడిగా తొలిసారిగా ఇందులో చేస్తున్నాను. ఐదు పాటలు వైవిధ్యంగా ఉంటాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో కొత్త తరహాలో చూస్తా'రని అన్నారు.
         ఈ చిత్రానికి మాటలు: రవి ఆర్‌.పుల్లెల, కెమెరా: కళ్యాణ్‌ సమి, ఆర్ట్‌: బాబ్జీ, నిర్వహణ: తారక్‌, నిర్మాత: పి.ఎల్‌.ఎన్‌.రాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీవిశాల్‌ కందుకూరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prema sainyam telugu movie
Kerala kutties attaction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles