Allarinaresh actionmovie sudeep

allarinaresh-actionmovie-sudeep

allarinaresh-actionmovie-sudeep

15.gif

Posted: 09/15/2012 05:59 PM IST
Allarinaresh actionmovie sudeep

        sudeep_allariసుడిగాడు చిత్రంతో సడన్ స్టారైపోయిన అల్లరి నరేష్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 3D చిత్రం 'యాక్షన్'. ఇప్పుడు ఈ సినిమాలో 'ఈగ' ఫేమ్ సుదీప్ ఓ కీలకమైన పాత్రని పోషిస్తున్నాడు. కన్నడలో హీరోగా, తెలుగులో విలన్ గా తీరికలేకుండా ఉన్న సుదీప్, ఈ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్  'మైక్ టైసన్' పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర నచ్చడంతో డేట్స్ సర్దుబాటు చేసుకుని మరీ ఈ సినిమా చేస్తున్నాడని చెబుతున్నారు. హాలీవుడ్ చిత్రం 'ది హేంగోవర్' కి రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ నిర్మాత అయిన అనిల్ సుంకర తొలిసారిగా దర్శకత్వం వహించటం, అందున 3D ఫార్మేట్ లో ఈ చిత్రాన్ని రూపొందిచటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
   sudeep_inn మరో విశేషమేమిటంటే.. ఒకప్పుడేకాదు, ఇప్పటికీ తన సంగీతంతో రచ్చ రచ్చ చేస్తోన్న బప్పీలహరి తనయుడు బప్పాలహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  'కిక్' ఫేమ్ శ్యాం వైభవ్, రాజు సుందరం, స్నేహా ఉల్లాల్,  కామ్నా, నీలం ఉపాధ్యాయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోన్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా రాబోతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Isha chawla serious
Prabhas rebel audio tamanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles